Idivo neebhaagyamu yemani seppamgavachchu

ఇదివో నీభాగ్యము యేమని చెప్పఁగవచ్చు
Language

(॥పల్లవి॥)
ఇదివో నీభాగ్యము యేమని చెప్పఁగవచ్చు
పొదలు సరసముల పోగులాయఁ గదరా

(॥ఇది॥)
వుప్పతిల్లుఁగుచముల నూఁదిపట్టి ఆపె నీతోఁ
జెప్పఁగలమాటలెల్లాం జెప్పఁగాను
చిప్పిలేవు చెమటల జెలియకాఁగిలే నీకు
కుప్పళించి మంచి కేళాకూళి ఆయఁగదరా

(॥ఇది॥)
బాగాలిచ్చి సారె సారె పైతరవై అపె నిన్ను
వేగినంతా గోరనంటి వేఁడుకోఁగాను
యీగతి బులకించేవు యీపెతోడిసరసమే
జాగులేని పువ్వులవసంత మాయఁగదరా

(॥ఇది॥)
చిగురునీమోవి యాని చేరి యాపె మొక్కఁగాను
నగుతా శ్రీవేంకటేశ నన్నేలితివి
తగ నీ విద్దరితోడఁ దమకించి పెనఁగేవు
తగిలి రతులు నీచే తాసులాయఁగదరా

(||pallavi||)
idivo nībhāgyamu yemani sĕppam̐gavachchu
pŏdalu sarasamula pogulāyam̐ gadarā

(||idi||)
vuppadillum̐gusamula nūm̐dibaṭṭi ābĕ nīdom̐
jĕppam̐galamāḍalĕllāṁ jĕppam̐gānu
sippilevu sĕmaḍala jĕliyagām̐gile nīgu
kuppaḽiṁchi maṁchi keḽāgūḽi āyam̐gadarā

(||idi||)
bāgālichchi sārĕ sārĕ paidaravai abĕ ninnu
veginaṁtā goranaṁṭi vem̐ḍugom̐gānu
yīgadi bulagiṁchevu yībĕdoḍisarasame
jāguleni puvvulavasaṁta māyam̐gadarā

(||idi||)
sigurunīmovi yāni seri yābĕ mŏkkam̐gānu
nagudā śhrīveṁkaḍeśha nannelidivi
taga nī viddaridoḍam̐ damagiṁchi pĕnam̐gevu
tagili radulu nīse tāsulāyam̐gadarā