Idivo neebeddariga memtani vinnavimchemu

ఇదివో నీపెద్దరిక మెంతని విన్నవించేము
Language

(॥పల్లవి॥)
ఇదివో నీపెద్దరిక మెంతని విన్నవించేము
కదిసి కదిసి ఱాతిగని వైతివి

(॥ఇది॥)
ఆపెకును నీకెకును ఆసలు నీవిచ్చి యిచ్చి
చేపట్టి చేరవచ్చితే సిగ్గువడేవు
కోపుల నిరువంకలా కొనగోళ్లు మేననంటి
యేపున నడిగితేను యెమ్మె చెప్పేవు

(॥ఇది॥)
యిద్దరినడుమ నీవు యేకతానఁ బవ్వళించి
వుద్దండాలు సేసితేను వొడ్డుకొనేవు
చద్దికి వేఁడికి వారు చన్నుల ని న్నొత్తి తేను
వొద్దిచెలులసాకిరు లూరకె పెట్టేవు

(॥ఇది॥)
శ్రీసతి భూసతిని చేసూటిఁ గూడికూడి
సేసలు నీపైఁ బెట్టితే చెలరేఁగేవు
ఆసల శ్రీవేంకటేశ అందరుదేవుళ్లతోడ
తాసువలెఁ దులఁదూఁగి దయిలువారేవు

(||pallavi||)
idivo nībĕddariga mĕṁtani vinnaviṁchemu
kadisi kadisi ṟādigani vaidivi

(||idi||)
ābĕgunu nīgĕgunu āsalu nīvichchi yichchi
sebaṭṭi seravachchide sigguvaḍevu
kobula niruvaṁkalā kŏnagoḽlu menanaṁṭi
yebuna naḍigidenu yĕmmĕ sĕppevu

(||idi||)
yiddarinaḍuma nīvu yegadānam̐ bavvaḽiṁchi
vuddaṁḍālu sesidenu vŏḍḍugŏnevu
saddigi vem̐ḍigi vāru sannula ni nnŏtti tenu
vŏddisĕlulasāgiru lūragĕ pĕṭṭevu

(||idi||)
śhrīsadi bhūsadini sesūḍim̐ gūḍigūḍi
sesalu nībaim̐ bĕṭṭide sĕlarem̐gevu
āsala śhrīveṁkaḍeśha aṁdarudevuḽladoḍa
tāsuvalĕm̐ dulam̐dūm̐gi dayiluvārevu