Idivo nee volla melu yimkaa nemi vunnado

ఇదివో నీ వొళ్ల మేలు యింకా నేమి వున్నదో
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ వొళ్ల మేలు యింకా నేమి వున్నదో
యెదుట నిలుచుండితే నే మేమి సేతువో

(॥ఇదివో॥)
చక్కనివాఁడ వంటేను జాణతనా లాడేవు
ఇక్కువ లంటితేను యేమేమి సేతువో
మొక్కవీఁడ వంటేనే మోవితేనె లడిగేవు
అక్కరతోఁ బొగడితే నపు డెంత సేతువో

(॥ఇదివో॥)
నేరుపరి వంటేను నీటు లెల్లాఁ జూపేవు
గోరఁ జీరితే నెంత కొండ సేతువో
ఆరయ నాఱడికాఁడ వంటేనే పెనఁగేవు
సారె చన్నుల నొత్తితే చల మెంత సేతువో

(॥ఇదివో॥)
చెలిమికాఁడ వంటేనే చేయి మీఁద వేసేవు
కలిసితే నీ వెంత కరఁగుదువో
యెలమి శ్రీవేంకటేశ యిందుండే నన్నుఁ గూడితి
అలమి పెనఁగితే ని న్నపు డెంత సేతువో

(||pallavi||)
idivo nī vŏḽla melu yiṁkā nemi vunnado
yĕduḍa nilusuṁḍide ne memi seduvo

(||idivo||)
sakkanivām̐ḍa vaṁṭenu jāṇadanā lāḍevu
ikkuva laṁṭidenu yememi seduvo
mŏkkavīm̐ḍa vaṁṭene movidenĕ laḍigevu
akkaradom̐ bŏgaḍide nabu ḍĕṁta seduvo

(||idivo||)
nerubari vaṁṭenu nīḍu lĕllām̐ jūbevu
goram̐ jīride nĕṁta kŏṁḍa seduvo
āraya nāṟaḍigām̐ḍa vaṁṭene pĕnam̐gevu
sārĕ sannula nŏttide sala mĕṁta seduvo

(||idivo||)
sĕlimigām̐ḍa vaṁṭene seyi mīm̐da vesevu
kaliside nī vĕṁta karam̐guduvo
yĕlami śhrīveṁkaḍeśha yiṁduṁḍe nannum̐ gūḍidi
alami pĕnam̐gide ni nnabu ḍĕṁta seduvo