ఇదివో నీ సుద్దులెల్లా నిటువంటివి
(॥పల్లవి॥)
ఇదివో నీ సుద్దులెల్లా నిటువంటివి
మదమున నీతో మారుమలయఁగఁ గలనా
(॥ఇది॥)
తగిలి నీవూడిగవుదానను నే మొక్కితేను
నగుతానే సరసము నాతో నాడేవు
వెగటుగా మాయక్క వింటే నిందు కేమనును
యెగసక్కీఁడవు సంగ తెఱఁగవుగాక
(॥ఇది॥)
గక్కన నే దూతికను కానుక నీ కిచ్చితేను
చెక్కునొక్కి నామీఁదసేసవెట్టేవు
చక్కఁగా మాయేలికసాని గంటే నేమనును
తక్కరీఁడ వీతగవు దలఁచవుగాక
(॥ఇది॥)
చెలికత్తె వాపెమారు సేవ నీకుఁ జేసితేను
కలసి శ్రీవేంకటేశ కాఁగిలించేవు
తిలకించి మాయమ్మ దెలిసితే నేమనును
బలిమికాఁద విదేయీ భావిఁచవు గాక
(||pallavi||)
idivo nī suddulĕllā niḍuvaṁṭivi
madamuna nīdo mārumalayam̐gam̐ galanā
(||idi||)
tagili nīvūḍigavudānanu ne mŏkkidenu
nagudāne sarasamu nādo nāḍevu
vĕgaḍugā māyakka viṁṭe niṁdu kemanunu
yĕgasakkīm̐ḍavu saṁga tĕṟam̐gavugāga
(||idi||)
gakkana ne dūdiganu kānuga nī kichchidenu
sĕkkunŏkki nāmīm̐dasesavĕṭṭevu
sakkam̐gā māyeligasāni gaṁṭe nemanunu
takkarīm̐ḍa vīdagavu dalam̐savugāga
(||idi||)
sĕligattĕ vābĕmāru seva nīgum̐ jesidenu
kalasi śhrīveṁkaḍeśha kām̐giliṁchevu
tilagiṁchi māyamma dĕliside nemanunu
balimigām̐da videyī bhāvim̐savu gāga