Idivo nee ramanumdu yenayavammaa

ఇదివో నీ రమణుఁడు యెనయవమ్మా
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ రమణుఁడు యెనయవమ్మా
పొదిగి కాఁగిట నిట్టె భోగించవమ్మా

(॥॥)
వనితరో కొత్తగాఁగ వంచినశిర సెత్తవు
ననుపాయ నిఁక నీవు నవ్వవమ్మా
మునుపనెల్లా కొంకి మోనాననే వుంటివి
మన గంటివి ఇఁక మాటాడవమ్మ

(॥॥)
గుట్టుతోడ ముసుఁగిడుకొని వుండితివి తొల్లి
చుట్టమవైతివి చక్కఁ జూడవమ్మ
చిట్టకపు సేఁతలతో సిగ్గులు నెరపితివి
అట్టె ఇంతట సరస మాడవమ్మా

(॥॥)
వాసిఁ బెండ్లికూఁతురవై వంతులిట్టె కోరితివి
ఆసతోడ మోవితేనె లానవమ్మా
బాసడిగి కూడితివి పాయ కలమేల్మంగవు
లాసి శ్రీవేంకటేశ్వరు లాలించవమ్మా

(||pallavi||)
idivo nī ramaṇum̐ḍu yĕnayavammā
pŏdigi kām̐giḍa niṭṭĕ bhogiṁchavammā

(||||)
vanidaro kŏttagām̐ga vaṁchinaśhira sĕttavu
nanubāya nim̐ka nīvu navvavammā
munubanĕllā kŏṁki monānane vuṁṭivi
mana gaṁṭivi im̐ka māḍāḍavamma

(||||)
guṭṭudoḍa musum̐giḍugŏni vuṁḍidivi tŏlli
suṭṭamavaidivi sakkam̐ jūḍavamma
siṭṭagabu sem̐talado siggulu nĕrabidivi
aṭṭĕ iṁtaḍa sarasa māḍavammā

(||||)
vāsim̐ bĕṁḍligūm̐turavai vaṁtuliṭṭĕ koridivi
āsadoḍa movidenĕ lānavammā
bāsaḍigi kūḍidivi pāya kalamelmaṁgavu
lāsi śhrīveṁkaḍeśhvaru lāliṁchavammā