Idivo nee mahimalu yevva rerumgudurayya

ఇదివో నీ మహిమలు యెవ్వ రెరుఁగుదురయ్య
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ మహిమలు యెవ్వ రెరుఁగుదురయ్య
మదనతంత్రములు మరపితివేవెూ

(॥॥)
చెలిచేత నే నీకుఁ జెప్పియంపినమాటలు
మలసి నీమోము చూచి మరిచెనేమో
యెలమి నాపెనైనా నీడకు నంపవైతివి
పలుకులనే నీవు భ్రమయించితివేమో

(॥॥)
పొందుకు నాపెచే నీకుఁ బుత్తెంచినవిడెము నీ-
సందడిపరాకునఁ దా నందెనో యేమో
ఇందుకైనా మారుసుద్ది మెరిఁగించవైతివి
గొంది నిట్టె తలఁపించుకొంటివోయేమో

(॥॥)
శ్రీ వేంకటేశుఁడ నీకుఁ జేయెత్తి మొక్కమంటే
భావించి నీవు గూడఁగా భ్రమసె నేమో
యీవల నలమేల్మంగని ఇటు నన్ను నేలితివి
మావతఁ దెచ్చితివి మన్నించితివేవెఁ

(||pallavi||)
idivo nī mahimalu yĕvva rĕrum̐gudurayya
madanadaṁtramulu marabidivevĕూ

(||||)
sĕliseda ne nīgum̐ jĕppiyaṁpinamāḍalu
malasi nīmomu sūsi marisĕnemo
yĕlami nābĕnainā nīḍagu naṁpavaidivi
palugulane nīvu bhramayiṁchidivemo

(||||)
pŏṁdugu nābĕse nīgum̐ buttĕṁchinaviḍĕmu nī-
saṁdaḍibarāgunam̐ dā naṁdĕno yemo
iṁdugainā mārusuddi mĕrim̐giṁchavaidivi
gŏṁdi niṭṭĕ talam̐piṁchugŏṁṭivoyemo

(||||)
śhrī veṁkaḍeśhum̐ḍa nīgum̐ jeyĕtti mŏkkamaṁṭe
bhāviṁchi nīvu gūḍam̐gā bhramasĕ nemo
yīvala nalamelmaṁgani iḍu nannu nelidivi
māvadam̐ dĕchchidivi manniṁchidivevĕm̐