Idivo nee mahima nenemani pogadudunu

ఇదివో నీ మహిమ నేనేమని పొగడుదును
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ మహిమ నేనేమని పొగడుదును
కదిసి నీవుండఁగాను కపటాలూఁ బాసె

(॥॥)
వేడుకతో నీనవ్వు వెన్నెలలుగాయఁగాను
యీడనే చిత్తము చీఁకటంతాఁ బాసె
నీడవలె రమణుఁడ నీవు వెంట రాఁగాను
యేడలేని మేనికాఁక యెండలెల్లాఁబాసె

(॥॥)
కలసి నీపలుకుల కప్పురాలు చల్లఁగాను
తలపోఁత విరహపుదప్పులు వాసె
చలువై, నీకరుణారసపువాన గురియఁగా
కలిగిన నామనసు కఱవెల్లాఁ బాసె

(॥॥)
కరకమలము నీవు కమ్మరఁ బై వేయఁగాను
మరునిబాణాలపగ మాలోఁ బాసె
ఇరవైశ్రీ వేంకటేశ ఇద్దరముఁ గూడఁగాను
శిరసులు వంచినట్టిసిగ్గులెల్లాఁ బాసె

(||pallavi||)
idivo nī mahima nenemani pŏgaḍudunu
kadisi nīvuṁḍam̐gānu kabaḍālūm̐ bāsĕ

(||||)
veḍugado nīnavvu vĕnnĕlalugāyam̐gānu
yīḍane sittamu sīm̐kaḍaṁtām̐ bāsĕ
nīḍavalĕ ramaṇum̐ḍa nīvu vĕṁṭa rām̐gānu
yeḍaleni menigām̐ka yĕṁḍalĕllām̐bāsĕ

(||||)
kalasi nībalugula kappurālu sallam̐gānu
talabom̐ta virahabudappulu vāsĕ
saluvai, nīgaruṇārasabuvāna guriyam̐gā
kaligina nāmanasu kaṟavĕllām̐ bāsĕ

(||||)
karagamalamu nīvu kammaram̐ bai veyam̐gānu
marunibāṇālabaga mālom̐ bāsĕ
iravaiśhrī veṁkaḍeśha iddaramum̐ gūḍam̐gānu
śhirasulu vaṁchinaṭṭisiggulĕllām̐ bāsĕ