Idivo nee jaanadanaa lemi seppedi

ఇదివో నీ జాణతనా లేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఇదివో నీ జాణతనా లేమి చెప్పేది
పొదిగి భూసతిని వీఁపునఁ గట్టుకొంటివి

(॥ఇది॥)
అంత నేఁ జక్కనిదాననంటా నన్నే పొగడేవు
ఎంత లేదు నీసుద్ద లేమిచెప్పేది
యింతేసి నేరిచికా యెమ్మెలఁ దులసిదెవి
పొంత నెత్తిఁ బెట్టుకొని పూజ గైకొంటివి

(॥ఇది॥)
వాడలోన నే నీకు వలతునంటా నాడేవు
యేడ గొద్ది నీమహిమ లేమిచెప్పేది
వేడుక లిట్టె రేఁచికా విరిఁదమ్మిపూవుల
మేడెపులకిమమ్మను మెడఁ గట్టుకొంటివి

(॥ఇది॥)
గట్టివి నాచన్నులంటా కాఁగిట బిగించేవు
యిట్టి నీగుణాలెల్లా నేమిచెప్పిది
చుట్టరికాలే చూపి సొరిది శ్రీవేంకటేశ
బెట్టుగాఁ బదారువేలఁ బెండ్లిడితివి

(||pallavi||)
idivo nī jāṇadanā lemi sĕppedi
pŏdigi bhūsadini vīm̐punam̐ gaṭṭugŏṁṭivi

(||idi||)
aṁta nem̐ jakkanidānanaṁṭā nanne pŏgaḍevu
ĕṁta ledu nīsudda lemisĕppedi
yiṁtesi nerisigā yĕmmĕlam̐ dulasidĕvi
pŏṁta nĕttim̐ bĕṭṭugŏni pūja gaigŏṁṭivi

(||idi||)
vāḍalona ne nīgu valadunaṁṭā nāḍevu
yeḍa gŏddi nīmahima lemisĕppedi
veḍuga liṭṭĕ rem̐sigā virim̐dammibūvula
meḍĕbulagimammanu mĕḍam̐ gaṭṭugŏṁṭivi

(||idi||)
gaṭṭivi nāsannulaṁṭā kām̐giḍa bigiṁchevu
yiṭṭi nīguṇālĕllā nemisĕppidi
suṭṭarigāle sūbi sŏridi śhrīveṁkaḍeśha
bĕṭṭugām̐ badāruvelam̐ bĕṁḍliḍidivi