Idivo naavamkam dappu imte maremee ledu

ఇదివో నావంకఁ దప్పు ఇంతే మరేమీ లేదు
Language

(॥పల్లవి॥)
ఇదివో నావంకఁ దప్పు ఇంతే మరేమీ లేదు
యెదురుగాఁ బైకొన్న దిది నేరమాయను

(॥॥)
వొంటిఁ దనతో వెంగె మొకమాటు నాడక
కంటగించి తా ముట్టితేఁ గసురుకొనక
దంటతనానఁ జెలులఁ దారుకాణ సేయక
ఇంటిలో నే నూరకున్న దిది నేరమాయనే

(॥॥)
యెందువోయినా వెంట నింతుల నే నంపక
కందువ మైకాఁకలకుఁ గాఁతాళించి పడక
సందడించి వేగుదాఁకా జాగుల నే పెట్టక
ఇందు రమ్మని పిలుచు టిది నేరమాయనే

(॥॥)
అట్టేకాఁగిలించరాఁగా నవ్వవిమోము గాక
వెట్టగా రతులఁ దన్ను వెస నలయించక
గట్టిగా శ్రీ వేంకటేశఁ గలసితి నీవేళ
ఇట్టె పైఁ గాలుమోఁచీ నిది నేరమాయను

(||pallavi||)
idivo nāvaṁkam̐ dappu iṁte maremī ledu
yĕdurugām̐ baigŏnna didi neramāyanu

(||||)
vŏṁṭim̐ danado vĕṁgĕ mŏgamāḍu nāḍaga
kaṁṭagiṁchi tā muṭṭidem̐ gasurugŏnaga
daṁṭadanānam̐ jĕlulam̐ dārugāṇa seyaga
iṁṭilo ne nūragunna didi neramāyane

(||||)
yĕṁduvoyinā vĕṁṭa niṁtula ne naṁpaga
kaṁduva maigām̐kalagum̐ gām̐tāḽiṁchi paḍaga
saṁdaḍiṁchi vegudām̐kā jāgula ne pĕṭṭaga
iṁdu rammani pilusu ṭidi neramāyane

(||||)
aṭṭegām̐giliṁcharām̐gā navvavimomu gāga
vĕṭṭagā radulam̐ dannu vĕsa nalayiṁchaga
gaṭṭigā śhrī veṁkaḍeśham̐ galasidi nīveḽa
iṭṭĕ paim̐ gālumom̐sī nidi neramāyanu