Idivo naasampadaa aastiyum baasti neevu idarambulu naagum baniledu

ఇదివో నాసంపదా ఆస్తియుఁ బాస్తి నీవు ఇతరంబులు నాకుఁ బనిలేదు
Language

(॥పల్లవి॥)
ఇదివో నాసంపదా ఆస్తియుఁ బాస్తి నీవు ఇతరంబులు నాకుఁ బనిలేదు
పదిలంబుగ నా బ్రతుకెల్లా నీవే పాలించఁగదే నారాయణా

(॥ఇది॥)
ఉపమల నే నార్జించిన ఉన్నతధనంబు నీవు
తపము సేయఁగాఁ గలిగెడు తత్ఫలంబు నీవు
జపములవలనఁ గలిగెడు నా తేజః ప్రభావమును నీవు
కపురుల దానధర్మాన పరోపకారంబులఁ బొందెడు మేలు నీవు

(॥ఇది॥)
పరము నాకు నీవు పరాత్పరమును నీవు
గరిమల నిలలోపలి యనంతభోగంబులు నీవు
గరుడోరగామరసిద్ధసాధ్యగంధర్వ పదములు నీవు
సురమునిపితృపూజావేదపాఠ సుకృతంబులు నీవు

(॥ఇది॥)
నాలుగాశ్రమంబులు నానావిధ్యలు నీవు
తాలిమి నాపంచవింశతితత్వంబులు నీవు
ఈలీల శ్రీవేంకటేశ్వరా యిన్నియు నీవు నా కని యెరిఁగితి
యేలితివి నాప్రాణంబులు నీవు యిల సర్వోపాయంబులు నీవు

(||pallavi||)
idivo nāsaṁpadā āstiyum̐ bāsti nīvu idaraṁbulu nāgum̐ baniledu
padilaṁbuga nā bradugĕllā nīve pāliṁcham̐gade nārāyaṇā

(||idi||)
ubamala ne nārjiṁchina unnadadhanaṁbu nīvu
tabamu seyam̐gām̐ galigĕḍu tatphalaṁbu nīvu
jabamulavalanam̐ galigĕḍu nā tejaḥ prabhāvamunu nīvu
kaburula dānadharmāna parobagāraṁbulam̐ bŏṁdĕḍu melu nīvu

(||idi||)
paramu nāgu nīvu parātparamunu nīvu
garimala nilalobali yanaṁtabhogaṁbulu nīvu
garuḍoragāmarasiddhasādhyagaṁdharva padamulu nīvu
suramunibitṛpūjāvedabāṭha sukṛtaṁbulu nīvu

(||idi||)
nālugāśhramaṁbulu nānāvidhyalu nīvu
tālimi nābaṁchaviṁśhadidatvaṁbulu nīvu
īlīla śhrīveṁkaḍeśhvarā yinniyu nīvu nā kani yĕrim̐gidi
yelidivi nāprāṇaṁbulu nīvu yila sarvobāyaṁbulu nīvu