ఇదివో నామొగమోట మేమని చెప్పుదునమ్మ
(॥పల్లవి॥)
ఇదివో నామొగమోట మేమని చెప్పుదునమ్మ
కదిసి నాచేఁత లేమీఁ గాదనఁడే యతఁడు
(॥ఇది॥)
అప్పటికి నామాఁట లాడుదుఁగాని యతని
వుప్పతించి కోపగించనోపనే నేను
చెప్పరాని విరహాన జెంది కసరుదుఁగాని
తప్పలెన్ని సేసినాను తమకించఁజాలనే
(॥ఇది॥)
పొంతనుండి యెందుకైనా బొమ్మల జంకింతుఁగాని
అతలో నాతని వీడనాడనోపనే
చింతతో రాకుండితేను చిట్టకాలు సేతుఁగాని
పంతము లందుకుఁగాను పచరించఁజాలనే
(॥ఇది॥)
వుండుండి యొక్కొకపరి వొట్టులు వెట్టుదుఁగాని
మెండొడ్డి తనమాటలు మీరనోపనే
దండిగా నన్నేలఁగాను తనయిచ్చనుందుఁగాని
అండనే శ్రీవేంకటేశు నలఇంచఁజాలవే
(||pallavi||)
idivo nāmŏgamoḍa memani sĕppudunamma
kadisi nāsem̐ta lemīm̐ gādanam̐ḍe yadam̐ḍu
(||idi||)
appaḍigi nāmām̐ṭa lāḍudum̐gāni yadani
vuppadiṁchi kobagiṁchanobane nenu
sĕpparāni virahāna jĕṁdi kasarudum̐gāni
tappalĕnni sesinānu tamagiṁcham̐jālane
(||idi||)
pŏṁtanuṁḍi yĕṁdugainā bŏmmala jaṁkiṁtum̐gāni
adalo nādani vīḍanāḍanobane
siṁtado rāguṁḍidenu siṭṭagālu sedum̐gāni
paṁtamu laṁdugum̐gānu pasariṁcham̐jālane
(||idi||)
vuṁḍuṁḍi yŏkkŏgabari vŏṭṭulu vĕṭṭudum̐gāni
mĕṁḍŏḍḍi tanamāḍalu mīranobane
daṁḍigā nannelam̐gānu tanayichchanuṁdum̐gāni
aṁḍane śhrīveṁkaḍeśhu nala̮iṁcham̐jālave