ఇదివో నాతలపోఁత లిన్నియు విన్నవించితి
(॥పల్లవి॥)
ఇదివో నాతలపోఁత లిన్నియు విన్నవించితి
యెదుట గాచుకుందాన యెరవు లేదిఁకను
(॥ఇది॥)
సేవలు సేసితే నీవు చేకొని మన్నింతునని
వావులు చెప్పితేను వలతునని
భావించి చూచితేను బత్తి నపైఁ జేతువని
నీవద్ద గాచుకుందాన నీ చిత్త మిఁకను
(॥ఇది॥)
సంతతముఁ గొలిచితే చనవెల్లా నిత్తువని
చెంత మొక్కితేఁ గోరిక చెల్లింతువని
మంతనము లాడితేను మచ్చికసేతువని
యింతటఁ గాచుకుందాన నీడేరించు మిఁకను
(॥ఇది॥)
సెలవుల నవ్వితేను చేతికి లోనౌదువని
సొలసితే నన్ను దయఁజూతువని
అలమి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
యెలమి గాచుకుందాన యేలము నన్నిఁకను
(||pallavi||)
idivo nādalabom̐ta linniyu vinnaviṁchidi
yĕduḍa gāsuguṁdāna yĕravu ledim̐kanu
(||idi||)
sevalu seside nīvu segŏni manniṁtunani
vāvulu sĕppidenu valadunani
bhāviṁchi sūsidenu batti nabaim̐ jeduvani
nīvadda gāsuguṁdāna nī sitta mim̐kanu
(||idi||)
saṁtadamum̐ gŏliside sanavĕllā nittuvani
sĕṁta mŏkkidem̐ goriga sĕlliṁtuvani
maṁtanamu lāḍidenu machchigaseduvani
yiṁtaḍam̐ gāsuguṁdāna nīḍeriṁchu mim̐kanu
(||idi||)
sĕlavula navvidenu sedigi lonauduvani
sŏlaside nannu dayam̐jūduvani
alami śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
yĕlami gāsuguṁdāna yelamu nannim̐kanu