ఇదివో నా విన్నపము ఇఁకనేమి నననోప
(॥పల్లవి॥)
ఇదివో నా విన్నపము ఇఁకనేమి నననోప
యెదలో వలపు నీవే యెరుఁగుదువు
(॥ఇది॥)
చలపాదిదానఁ గాను సాదించేటిదానఁ గాను
తలకొని నిన్నుదూరేదానఁ గాను
వలపులకాంకల వసివాడనోపక
వెలినుండి నీకు విన్నవించేదానఁ గాని
(॥ఇది॥)
పెనఁగేటిదానఁ గాను బిగిసేటిదానఁ గాను
తనియక కక్కసించేదానఁ గాను
మనసు నీకొప్పగించి మాటల నిన్నుఁ బోగడి
వినయముతో విన్నవించేదానఁ గాని
(॥ఇది॥)
విరసవుదానఁ గాను వెక్కసపుదానఁగాను
తరితీపుతోఁ గలసేదానఁ గాని
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
వెరవుతో మొక్కి విన్నవించేదానఁగాని
(||pallavi||)
idivo nā vinnabamu im̐kanemi nananoba
yĕdalo valabu nīve yĕrum̐guduvu
(||idi||)
salabādidānam̐ gānu sādiṁcheḍidānam̐ gānu
talagŏni ninnudūredānam̐ gānu
valabulagāṁkala vasivāḍanobaga
vĕlinuṁḍi nīgu vinnaviṁchedānam̐ gāni
(||idi||)
pĕnam̐geḍidānam̐ gānu bigiseḍidānam̐ gānu
taniyaga kakkasiṁchedānam̐ gānu
manasu nīgŏppagiṁchi māḍala ninnum̐ bogaḍi
vinayamudo vinnaviṁchedānam̐ gāni
(||idi||)
virasavudānam̐ gānu vĕkkasabudānam̐gānu
taridībudom̐ galasedānam̐ gāni
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
vĕravudo mŏkki vinnaviṁchedānam̐gāni