Idivo naa mohamu nee kemtani seppudu nenu

ఇదివో నా మోహము నీ కెంతని చెప్పుదు నేను
Language

(॥పల్లవి॥)
ఇదివో నా మోహము నీ కెంతని చెప్పుదు నేను
కదిసి నీ మోము చూచి కన్ను మూయఁజాలను

(॥ఇది॥)
వొత్తి నిన్ను దూరనోప వొట్టులు వెట్టఁగనోప
హత్తి నీతో నిచ్చకము లాడేఁగాని
కొత్తగాఁ గొసరనోప గోరికొన గీరనోప
చిత్తమురా సేవలిట్టె సేసేఁగాని

(॥ఇది॥)
పెనఁగి గుంపించనోప బీరము చూపఁగనోప
ననుపు సేసుక నీతో నవ్వేఁగాని
పొనుఁగుచు దాఁగనోప బొమ్మల జంకించనోప
వినయాన మొక్కి నిన్ను వేఁడుకొనేఁగాని

(॥ఇది॥)
సిగ్గుతో నలుగనోప శిరసు వంచఁగనోప
వొగ్గి మోవి తేనెకు నోరూరేఁగాని
వెగ్గళముగా నన్ను శ్రీవేంకటేశ యేలితివి
యెగ్గు లెంచనోప నిన్ను నిట్టె మెచ్చేఁగాని

(||pallavi||)
idivo nā mohamu nī kĕṁtani sĕppudu nenu
kadisi nī momu sūsi kannu mūyam̐jālanu

(||idi||)
vŏtti ninnu dūranoba vŏṭṭulu vĕṭṭam̐ganoba
hatti nīdo nichchagamu lāḍem̐gāni
kŏttagām̐ gŏsaranoba gorigŏna gīranoba
sittamurā sevaliṭṭĕ sesem̐gāni

(||idi||)
pĕnam̐gi guṁpiṁchanoba bīramu sūbam̐ganoba
nanubu sesuga nīdo navvem̐gāni
pŏnum̐gusu dām̐ganoba bŏmmala jaṁkiṁchanoba
vinayāna mŏkki ninnu vem̐ḍugŏnem̐gāni

(||idi||)
siggudo naluganoba śhirasu vaṁcham̐ganoba
vŏggi movi tenĕgu norūrem̐gāni
vĕggaḽamugā nannu śhrīveṁkaḍeśha yelidivi
yĕggu lĕṁchanoba ninnu niṭṭĕ mĕchchem̐gāni