ఇదివో నా కాఁపురము లెరఁగ విన్నవించితి
(॥పల్లవి॥)
ఇదివో నా కాఁపురము లెరఁగ విన్నవించితి
మదిలోన మఱవక మన్నించు నన్నును
(॥ఇది॥)
తనువు సిగ్గుతోడుతఁ దగితి యింటిలోనుండు
మనసు నీపైనుండు మరిగెఁ గాన
కనుచూపు లివి నీరాకల కదురైవుండు
తనివోని వలపులు తలకెక్కియుండు
(॥ఇది॥)
చేతులు చింతతోడుత చెక్కులపైనే వుండు
ఆతుమ నీ దేవులయ్యే యాపలనుండు
వాతెర మోనము మీఁద వదలనట్టె వుండు
యీతల నాలిక నీ పేరెంచుకొంటా నుండును
(॥ఇది॥)
చన్నులు గుట్టుతోడుత సరిఁబయ్యదలోనుండు
కన్నెపాయము నీకుఁగాఁ గాచుకవుండు
ఇన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సన్నలు చాయలును నీ సరసముల నుండు
(||pallavi||)
idivo nā kām̐puramu lĕram̐ga vinnaviṁchidi
madilona maṟavaga manniṁchu nannunu
(||idi||)
tanuvu siggudoḍudam̐ dagidi yiṁṭilonuṁḍu
manasu nībainuṁḍu marigĕm̐ gāna
kanusūbu livi nīrāgala kaduraivuṁḍu
tanivoni valabulu talagĕkkiyuṁḍu
(||idi||)
sedulu siṁtadoḍuda sĕkkulabaine vuṁḍu
āduma nī devulayye yābalanuṁḍu
vādĕra monamu mīm̐da vadalanaṭṭĕ vuṁḍu
yīdala nāliga nī perĕṁchugŏṁṭā nuṁḍunu
(||idi||)
sannulu guṭṭudoḍuda sarim̐bayyadalonuṁḍu
kannĕbāyamu nīgum̐gām̐ gāsugavuṁḍu
inniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sannalu sāyalunu nī sarasamula nuṁḍu