Idivo naa bhaagyamu yemi seppene

ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే
Language

(॥పల్లవి॥)
ఇదివో నా భాగ్యము యేమి చెప్పేనే
ముదముతోఁ దన కిట్టె మొక్కితి నే ననవే

(॥ఇదివో॥)
చుట్టమైన యట్టివాఁడు సులభఁ డైనట్టివాఁడు
దట్టమై నా కిన్నిటాను తానే కదే
పొట్టఁబొరుగున నుండి పొరచి వెట్టంపి నేఁడు
గట్టిగా నింతకరుణ గలదు గా నాకు

(॥ఇదివో॥)
అంతరంగ మైనవాఁడు ఆయ మెరిఁగినవాఁడు
చెంతలఁ దానే అని చెప్పేఁ గదే
వంతులు వాసు లెంచక వాకిటికి వచ్చె నేఁడు
యింత మన్నించఁ దాఁ గాక యిఁక నెవ్వరే

(॥ఇదివో॥)
వహించుకొనేవాఁడు వద్ద నిట్టె వుండేవాఁడు
విహరించ నా కిన్నటా వెలనె తానె
వహి కెక్క శ్రీవెంకటవల్లభుఁ డితఁడే నన్ను
తహతహ దీరఁ గూడె తగవరి అవుఁ గదే

(||pallavi||)
idivo nā bhāgyamu yemi sĕppene
mudamudom̐ dana kiṭṭĕ mŏkkidi ne nanave

(||idivo||)
suṭṭamaina yaṭṭivām̐ḍu sulabham̐ ḍainaṭṭivām̐ḍu
daṭṭamai nā kinniḍānu tāne kade
pŏṭṭam̐bŏruguna nuṁḍi pŏrasi vĕṭṭaṁpi nem̐ḍu
gaṭṭigā niṁtagaruṇa galadu gā nāgu

(||idivo||)
aṁtaraṁga mainavām̐ḍu āya mĕrim̐ginavām̐ḍu
sĕṁtalam̐ dāne ani sĕppem̐ gade
vaṁtulu vāsu lĕṁchaga vāgiḍigi vachchĕ nem̐ḍu
yiṁta manniṁcham̐ dām̐ gāga yim̐ka nĕvvare

(||idivo||)
vahiṁchugŏnevām̐ḍu vadda niṭṭĕ vuṁḍevām̐ḍu
vihariṁcha nā kinnaḍā vĕlanĕ tānĕ
vahi kĕkka śhrīvĕṁkaḍavallabhum̐ ḍidam̐ḍe nannu
tahadaha dīram̐ gūḍĕ tagavari avum̐ gade