ఇదివో మేలుసుద్ది మీ కిన్నిటా విన్నవించితి
(॥పల్లవి॥)
ఇదివో మేలుసుద్ది మీ కిన్నిటా విన్నవించితి
మదిలోన మఱవక మన్నించు మనెను
(॥ఇది॥)
కలికి కన్నుల దొక కతకారి । నీకు
వలచితినని చెప్పె వాడలోన
మొలక చన్నులది ముద్దులాడి । నిన్నుఁ
బిలిచి లెమ్మని యంపెఁ బ్రియముతో నన్నును
(॥ఇది॥)
చక్కెర మోవిది యా జవరాలు । నీకు
మొక్కితి నను మనెను మొహమున
చెక్కుటద్దాలది కడుఁజేఁతలాఁడి । తొల్లె
మిక్కుటపు వయసెల్లా మీఁదెత్తితి ననెను
(॥ఇది॥)
నీలపుఁ గుంతలాలది నెరవాది । నీకు -
నాల నని యెరిఁగించె నందరిలోన
యీలీల శ్రీవేంకటేశ యింటికి వచ్చేలితివి
చాలా నలమేల్మంగకు సవతి నే ననెను
(||pallavi||)
idivo melusuddi mī kinniḍā vinnaviṁchidi
madilona maṟavaga manniṁchu manĕnu
(||idi||)
kaligi kannula dŏga kadagāri | nīgu
valasidinani sĕppĕ vāḍalona
mŏlaga sannuladi muddulāḍi | ninnum̐
bilisi lĕmmani yaṁpĕm̐ briyamudo nannunu
(||idi||)
sakkĕra movidi yā javarālu | nīgu
mŏkkidi nanu manĕnu mŏhamuna
sĕkkuḍaddāladi kaḍum̐jem̐talām̐ḍi | tŏllĕ
mikkuḍabu vayasĕllā mīm̐dĕttidi nanĕnu
(||idi||)
nīlabum̐ guṁtalāladi nĕravādi | nīgu -
nāla nani yĕrim̐giṁchĕ naṁdarilona
yīlīla śhrīveṁkaḍeśha yiṁṭigi vachchelidivi
sālā nalamelmaṁgagu savadi ne nanĕnu