Idivo mee suddulu imduge veragayyeeni

ఇదివో మీ సుద్దులు ఇందుకే వెరగయ్యీని
Language

(॥పల్లవి॥)
ఇదివో మీ సుద్దులు ఇందుకే వెరగయ్యీని
వుదుటు మీ వయసులు వొక్కరతే కాదా

(॥॥)
వేడుకతో నిన్నుఁగూడి వింతలై యుండి తనకు
వాడుమోమేల వచ్చె వనితకును
జాడతో నీమోమైతే సరిఁజెంగలించినది
వోడక మీకిద్దరికీ వొక్కరతే కాదా

(॥॥)
పువ్వువలె నీతోడ పొందుసేసె నిందాఁకా
నివ్వెరగేఁటికి వచ్చె నెలఁతకును
నవ్వులైతే నీసెలవి నారుకొన్నట్టున్నవి
వువ్విళ్లూర నిద్దరికీ నొక్కరతే కాదా

(॥॥)
కలిమె నీకాఁగిటను కడఁగి శ్రీవేంకటేశ
అలపులేఁటికి వచ్చె నంగనకును
కొలఁదిలేవు నీకైతే గుఱుతైనచెనకులు
వొలిసి మీకిద్దరికీ నొక్కరతే కాదా

(||pallavi||)
idivo mī suddulu iṁduge vĕragayyīni
vuduḍu mī vayasulu vŏkkarade kādā

(||||)
veḍugado ninnum̐gūḍi viṁtalai yuṁḍi tanagu
vāḍumomela vachchĕ vanidagunu
jāḍado nīmomaide sarim̐jĕṁgaliṁchinadi
voḍaga mīgiddarigī vŏkkarade kādā

(||||)
puvvuvalĕ nīdoḍa pŏṁdusesĕ niṁdām̐kā
nivvĕragem̐ṭigi vachchĕ nĕlam̐tagunu
navvulaide nīsĕlavi nārugŏnnaṭṭunnavi
vuvviḽlūra niddarigī nŏkkarade kādā

(||||)
kalimĕ nīgām̐giḍanu kaḍam̐gi śhrīveṁkaḍeśha
alabulem̐ṭigi vachchĕ naṁganagunu
kŏlam̐dilevu nīgaide guṟudainasĕnagulu
vŏlisi mīgiddarigī nŏkkarade kādā