Idivo mana nerubulu yemunnavi

ఇదివో మన నేరుపులు యేమున్నవి
Language

(॥పల్లవి॥)
ఇదివో మన నేరుపులు యేమున్నవి
నిదుల మమ్ము నిలుప నీచేతిదే కాదా

(॥ఇదివో॥)
చెనకి నీవే నన్ను సిగ్గు దేరుచఁగ బట్టె
ననుపుచేసుక నీతో నవ్వితిఁ గాకాఁ
కొనదాఁకా నీవు నాతో గుట్టుచేసుక వుండితే
చనవున వేగుదాఁకా జాగరాలే కాదా

(॥ఇదివో॥)
కొండవలెఁ జేయి వట్టి కొంకుఁ దీరుచఁగఁ బట్టె
అండనుండి నీతో మాటలాడితిఁ గాక
నిండుకొన్న రాజసాన నీ వెంత దడవున్నఁ
జండిపట్టి జవ్వనము సరి యాఁక గాదా

(॥ఇదివో॥)
రమ్మని ఇట్టె నన్ను రతులఁ గూడఁగఁ బట్టె
బిమ్మటిగా నిన్ను నే మెప్పించితిఁ గాక
వుమ్మడి శ్రీవేంకటేశ వూరకే నీ వుండితేను
వుమ్మగిలు నాసల నోరూటలే కాదా

(||pallavi||)
idivo mana nerubulu yemunnavi
nidula mammu niluba nīsedide kādā

(||idivo||)
sĕnagi nīve nannu siggu derusam̐ga baṭṭĕ
nanubusesuga nīdo navvidim̐ gāgām̐
kŏnadām̐kā nīvu nādo guṭṭusesuga vuṁḍide
sanavuna vegudām̐kā jāgarāle kādā

(||idivo||)
kŏṁḍavalĕm̐ jeyi vaṭṭi kŏṁkum̐ dīrusam̐gam̐ baṭṭĕ
aṁḍanuṁḍi nīdo māḍalāḍidim̐ gāga
niṁḍugŏnna rājasāna nī vĕṁta daḍavunnam̐
jaṁḍibaṭṭi javvanamu sari yām̐ka gādā

(||idivo||)
rammani iṭṭĕ nannu radulam̐ gūḍam̐gam̐ baṭṭĕ
bimmaḍigā ninnu ne mĕppiṁchidim̐ gāga
vummaḍi śhrīveṁkaḍeśha vūrage nī vuṁḍidenu
vummagilu nāsala norūḍale kādā