Idivo maa yajnyaaana meppudunu sahajame

ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
Language

(॥పల్లవి॥)
ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
కదివి నీవే నన్నుఁ గరుణించవయ్యా

(॥ఇది॥)
తల్లి చంకనున్న బిడ్డ తమతోఁ జన్ను దాగుతా
వొల్లఁడు తండ్రి యెత్తుకో నొగిఁబోతేను
మల్లడ నీ మాయలో మరిగిన జీవముల
మెల్లనే మీ సేవసేసి మిమ్ముఁ జేరఁ జాలము

(॥ఇది॥)
రెక్కల మరుఁగుపక్షి రెక్కల కిందనే కాని
యెక్కదు వద్దనే మేడ యెంత వున్నాను
పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము
యెక్కుడైన వైకుంఠ మిది గోరఁ జాలమూ

(॥ఇది॥)
నీరులో నుండేటి కప్పనీటిలోనే వుండుఁగాని
వూరకే పరపుమీద నుండ దెంతైనాను
ఆరయ సంసారములో అజ్ఞానపు జీవులము
బోరన శ్రీ వేంకటేశ బుద్ధి చెప్పి కావవే

(||pallavi||)
idivo mā yajñāna mĕppuḍunu sahajame
kadivi nīve nannum̐ garuṇiṁchavayyā

(||idi||)
talli saṁkanunna biḍḍa tamadom̐ jannu dāgudā
vŏllam̐ḍu taṁḍri yĕttugo nŏgim̐bodenu
mallaḍa nī māyalo marigina jīvamula
mĕllane mī sevasesi mimmum̐ jeram̐ jālamu

(||idi||)
rĕkkala marum̐gubakṣhi rĕkkala kiṁdane kāni
yĕkkadu vaddane meḍa yĕṁta vunnānu
pakkana janmamĕttina prabaṁchabu jīvulamu
yĕkkuḍaina vaiguṁṭha midi goram̐ jālamū

(||idi||)
nīrulo nuṁḍeḍi kappanīḍilone vuṁḍum̐gāni
vūrage parabumīda nuṁḍa dĕṁtainānu
āraya saṁsāramulo ajñānabu jīvulamu
borana śhrī veṁkaḍeśha buddhi sĕppi kāvave