ఇదివో మా వొళ్లి నేర మిఁకనేఁటిది
(॥పల్లవి॥)
ఇదివో మా వొళ్లి నేర మిఁకనేఁటిది
నిదుల నా జవ్వనము నీచేతి దిఁకను
(॥ఇది॥)
ననిచి యప్పటి నీతో నవ్వులు నే నవ్వితిఁగా
తనిసి యన్నిటా నీపైఁ దయకించుక
మనసు మెత్తనిదాన మఱి యేమిచెప్పే నీకు
నినుపై నాభాగ్యము నీచేతి దిఁకను
(॥ఇది॥)
సొలసి యప్పటి నీతో సుద్దులు చెప్పితిఁగా
బలిమి పాడిపంతాలు పచరించక
అలరినమేలుదాన అననేమున్నది నిన్ను
నెలవై నాధైర్యము నీచేతి దిఁకను
(॥ఇది॥)
గక్కన నప్పటి నీతో కాఁగిటఁగూడితిఁగా
చొక్కులఁబెట్టుచు నీతో సోదించక
వొక్కటై శ్రీ వేంకటేశ వొరయనేఁటికి నిన్ను
నిక్కపు నాసిగ్గులెల్లా నీచేతి దిఁకను
(||pallavi||)
idivo mā vŏḽli nera mim̐kanem̐ṭidi
nidula nā javvanamu nīsedi dim̐kanu
(||idi||)
nanisi yappaḍi nīdo navvulu ne navvidim̐gā
tanisi yanniḍā nībaim̐ dayagiṁchuga
manasu mĕttanidāna maṟi yemisĕppe nīgu
ninubai nābhāgyamu nīsedi dim̐kanu
(||idi||)
sŏlasi yappaḍi nīdo suddulu sĕppidim̐gā
balimi pāḍibaṁtālu pasariṁchaga
alarinameludāna ananemunnadi ninnu
nĕlavai nādhairyamu nīsedi dim̐kanu
(||idi||)
gakkana nappaḍi nīdo kām̐giḍam̐gūḍidim̐gā
sŏkkulam̐bĕṭṭusu nīdo sodiṁchaga
vŏkkaḍai śhrī veṁkaḍeśha vŏrayanem̐ṭigi ninnu
nikkabu nāsiggulĕllā nīsedi dim̐kanu