ఇదివో మా విన్నపము యెన్ని సేసినా
(॥పల్లవి॥)
ఇదివో మా విన్నపము యెన్ని సేసినా
వుదుటొక్కటే వారి వుపమలు వింతలు
(॥ఇది॥)
చలిమి బలిమిగల సతి నే నీకు
యెలయింపుఁ గాంతలు మరెందరు లేరు
వలపే సరి గాని వాడికె లెచ్చుకుందురు
అలరు లొక్కటే వాస నందులోన వేరులు
(॥ఇది॥)
నంటున నీవు మన్నించే నగవు నాది
యింటింట మరి నవ్వులు యెంత లేదు
కంటి యింపే గురిగాని గాలి ముడె(డి) గట్టరాదు
వంటక మొక్కటైనా వడ్లపేరు వేరులు
(॥ఇది॥)
గక్కన నీవు కూడిన కాఁగిలి యిది
యెక్కడి సతుల కాఁ గిలెంత లేదు
చక్కఁదనమే సొమ్ము సకలముఁ గలిగినా
యెక్కువ శ్రీ వేంకటేశ యితరులు వేరులు
(||pallavi||)
idivo mā vinnabamu yĕnni sesinā
vuduḍŏkkaḍe vāri vubamalu viṁtalu
(||idi||)
salimi balimigala sadi ne nīgu
yĕlayiṁpum̐ gāṁtalu marĕṁdaru leru
valabe sari gāni vāḍigĕ lĕchchuguṁduru
alaru lŏkkaḍe vāsa naṁdulona verulu
(||idi||)
naṁṭuna nīvu manniṁche nagavu nādi
yiṁṭiṁṭa mari navvulu yĕṁta ledu
kaṁṭi yiṁpe gurigāni gāli muḍĕ(ḍi) gaṭṭarādu
vaṁṭaga mŏkkaḍainā vaḍlaberu verulu
(||idi||)
gakkana nīvu kūḍina kām̐gili yidi
yĕkkaḍi sadula kām̐ gilĕṁta ledu
sakkam̐daname sŏmmu sagalamum̐ galiginā
yĕkkuva śhrī veṁkaḍeśha yidarulu verulu