ఇదివో మా సాజము యెఱఁగ విన్నవించితి
(॥పల్లవి॥)
ఇదివో మా సాజము యెఱఁగ విన్నవించితి
కదిసి మన్నించవయ్య కాదనము పనులు
(॥ఇది॥)
వంకలొత్తీ నాపె నీవలపులు మాఁటలు
అంకెవచ్చి నట్టెల్లా నీవాడవయ్య
సంకెలేక నిజమాడి సాదించనేకాని
పొంకాలు సేయనేరము బూటకములెల్లాను
(॥ఇది॥)
చక్క గప్పీ నాపె చక్కని నీమేని చేఁతలు
దక్కించు కొంటివి మమ్ము దగ్గరవయ్య
పక్కన నెరుసులుంటే బయటవేయనేకాని
మిక్కిలి దాఁచనేరము మెరమెచ్చులెల్లాను
(॥ఇది॥)
పేరఁబెట్టీ నాపె నీపెలుచు మోవి తేనెలు
చేరి మాకు నియ్యవయ్య చేకొనేము
కోరి శ్రీ వేంకటేశ్వర కూడితివి సందుననే
ఆరీతిఁ జెప్పనేరము ఆయపు నీరతులు
(||pallavi||)
idivo mā sājamu yĕṟam̐ga vinnaviṁchidi
kadisi manniṁchavayya kādanamu panulu
(||idi||)
vaṁkalŏttī nābĕ nīvalabulu mām̐ṭalu
aṁkĕvachchi naṭṭĕllā nīvāḍavayya
saṁkĕlega nijamāḍi sādiṁchanegāni
pŏṁkālu seyaneramu būḍagamulĕllānu
(||idi||)
sakka gappī nābĕ sakkani nīmeni sem̐talu
dakkiṁchu kŏṁṭivi mammu daggaravayya
pakkana nĕrusuluṁṭe bayaḍaveyanegāni
mikkili dām̐saneramu mĕramĕchchulĕllānu
(||idi||)
peram̐bĕṭṭī nābĕ nībĕlusu movi tenĕlu
seri māgu niyyavayya segŏnemu
kori śhrī veṁkaḍeśhvara kūḍidivi saṁdunane
ārīdim̐ jĕppaneramu āyabu nīradulu