ఇదివో మా బలు వీమాఁటే చెప్పరే
(॥పల్లవి॥)
ఇదివో మా బలు వీమాఁటే చెప్పరే
యెదుట నాతఁడు యేమనీనే
(॥ఇది॥)
బింకము లాడేమా ప్రియుని తోడుత
జింకించి బొమ్మల సాదింతుము
అంకెకు లోనైన యంతటిమీఁదట
కంకిగ రతులఁ గక్కసింతుము
(॥ఇది॥)
తప్పులించేమా తనతోడ నేము
రెప్పలెత్తి రేసు రేఁతుము
కప్పుర విడేలఁ గలసిన మీఁద
కుప్పల చెమటఁ గురియింతుము
(॥ఇది॥)
సిగ్గువడేమా శ్రీ వేంకటేశుతో
బిగ్గెఁ గాఁగిటను బిగింతుము
యెగ్గులెంచక తా నిట్టె నన్నుఁ గూడె
వెగ్గళించితే వేఁడుకొందుము
(||pallavi||)
idivo mā balu vīmām̐ṭe sĕppare
yĕduḍa nādam̐ḍu yemanīne
(||idi||)
biṁkamu lāḍemā priyuni toḍuda
jiṁkiṁchi bŏmmala sādiṁtumu
aṁkĕgu lonaina yaṁtaḍimīm̐daḍa
kaṁkiga radulam̐ gakkasiṁtumu
(||idi||)
tappuliṁchemā tanadoḍa nemu
rĕppalĕtti resu rem̐tumu
kappura viḍelam̐ galasina mīm̐da
kuppala sĕmaḍam̐ guriyiṁtumu
(||idi||)
sigguvaḍemā śhrī veṁkaḍeśhudo
biggĕm̐ gām̐giḍanu bigiṁtumu
yĕggulĕṁchaga tā niṭṭĕ nannum̐ gūḍĕ
vĕggaḽiṁchide vem̐ḍugŏṁdumu