ఇదివో ఇప్పటిమాట ఇంకానేమేమి గలవో
(॥పల్లవి॥)
ఇదివో ఇప్పటిమాట ఇంకానేమేమి గలవో
యెదుట నే నిట్టే పంతమిచ్చితినంటివట
(॥ఇది॥)
మచ్చికతో నీవు నాకె మంతనము లాడుకోఁగా
వచ్చి నాతో పొంచువిన్నవారు చెప్పిరి
కుచ్చి నీచెక్కులమీఁద గోరుదీయిమంటివట
వచ్చి యాపెకే నీవు వలతునంటివట
(॥ఇది॥)
పన్ని నీవు నాపెను బాసలు సేసుకోఁగాను
కన్నవారే నాతో నీకడఁ జెప్పిరి
సన్నల నెదురాడనిచన విస్తినంటివట
చిన్నైనాఁ బెద్దదేవులఁ జేసేనంటివట
(॥ఇది॥)
ఆడ నాపెఁగూడి నాకై అప్పణ లిప్పించుకోఁగా
వూడిగపువారే నావొద్దఁ జెప్పిరి
జాడల శ్రీవేంకటేశ సరిగా నన్నేలితివి
వోడక యిందూ నందూ వుండేనంటివట
(||pallavi||)
idivo ippaḍimāḍa iṁkānememi galavo
yĕduḍa ne niṭṭe paṁtamichchidinaṁṭivaḍa
(||idi||)
machchigado nīvu nāgĕ maṁtanamu lāḍugom̐gā
vachchi nādo pŏṁchuvinnavāru sĕppiri
kuchchi nīsĕkkulamīm̐da gorudīyimaṁṭivaḍa
vachchi yābĕge nīvu valadunaṁṭivaḍa
(||idi||)
panni nīvu nābĕnu bāsalu sesugom̐gānu
kannavāre nādo nīgaḍam̐ jĕppiri
sannala nĕdurāḍanisana vistinaṁṭivaḍa
sinnainām̐ bĕddadevulam̐ jesenaṁṭivaḍa
(||idi||)
āḍa nābĕm̐gūḍi nāgai appaṇa lippiṁchugom̐gā
vūḍigabuvāre nāvŏddam̐ jĕppiri
jāḍala śhrīveṁkaḍeśha sarigā nannelidivi
voḍaga yiṁdū naṁdū vuṁḍenaṁṭivaḍa