ఇదివో ద్రిష్టాంతాలు యేచి??? చూడరే చెలులు
(॥పల్లవి॥)
ఇదివో ద్రిష్టాంతాలు యేచి??? చూడరే చెలులు
యెదురెదురను మనయింటిలోనె వున్నవి
(॥ఇది॥)
మాటలెల్లా మంచివే మనసు లెనసితేను
చాటువకెక్కు పొందులు సమ్మతించితే
వాటమౌనుఁ దమకము వలపులు మించితేను
పాటించి కూరిమిగలపతికి సతికిని
(॥ఇది॥)
చేసినవెల్లాఁ జేఁతలే చేరి చుట్టాలై యుండితే
ఆసలు రేఁగు నెప్పడూ సండనుండితే
బాసలెల్లా నీడేరు పాయని తగులైతేను
సేసవెట్టి పెండ్లాడిన చెలికి మగనికి
(॥ఇది॥)
భావించిన వెల్లా నౌను బత్తి కడుఁగలిగితే
చేవదేరుఁ గోరికలు చెనకి తేను
వావులొనఁగూడీ నిదేవరుసఁ బెండ్లాడఁగాను
శ్రీవేంకటేశునకు శ్రీమహాదేవికి
(||pallavi||)
idivo driṣhṭāṁtālu yesi??? sūḍare sĕlulu
yĕdurĕduranu manayiṁṭilonĕ vunnavi
(||idi||)
māḍalĕllā maṁchive manasu lĕnasidenu
sāḍuvagĕkku pŏṁdulu sammadiṁchide
vāḍamaunum̐ damagamu valabulu miṁchidenu
pāḍiṁchi kūrimigalabadigi sadigini
(||idi||)
sesinavĕllām̐ jem̐tale seri suṭṭālai yuṁḍide
āsalu rem̐gu nĕppaḍū saṁḍanuṁḍide
bāsalĕllā nīḍeru pāyani tagulaidenu
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕligi maganigi
(||idi||)
bhāviṁchina vĕllā naunu batti kaḍum̐galigide
sevaderum̐ gorigalu sĕnagi tenu
vāvulŏnam̐gūḍī nidevarusam̐ bĕṁḍlāḍam̐gānu
śhrīveṁkaḍeśhunagu śhrīmahādevigi