ఇదివో దిష్టము చూడు యింతి ఇదె నీ విదె
(॥పల్లవి॥)
ఇదివో దిష్టము చూడు యింతి ఇదె నీ విదె
మదిలో మా విన్నపాలు మఱవకువయ్యా
(॥ఇది॥)
నిన్నుఁ జూచి నంతలోనే నెలఁతమై చెమరించె
చన్నులపైఁ బులకలు జాజుకొనెను
కన్నులఁ దేటలు మించె కళలు మోమున నిండె
యెన్నేవి నీమీఁది మోహ మేమిచెప్పేమయ్యా
(॥ఇది॥)
మాటలాడినంతలోనే మగువకుఁ గొప్పు జారె
తేటలైన సిగ్గులెల్లా దిమ్మువాసెను
పాటించి కోరికలెల్లా భావాన నీరిక లొత్తె
కూటువ నీపై కాంక్షలు కొలఁదియేదయ్యా
(॥ఇది॥)
దగ్గరినయంతలోనే తతిగొనె నూరుపులు
దిగ్గనఁ బయ్యదకొంగు దిగజారెను
అగ్గమై శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
కగ్గుదీర నిన్నుఁ గూడె కడమేడదయ్యా
(||pallavi||)
idivo diṣhṭamu sūḍu yiṁti idĕ nī vidĕ
madilo mā vinnabālu maṟavaguvayyā
(||idi||)
ninnum̐ jūsi naṁtalone nĕlam̐tamai sĕmariṁchĕ
sannulabaim̐ bulagalu jājugŏnĕnu
kannulam̐ deḍalu miṁchĕ kaḽalu momuna niṁḍĕ
yĕnnevi nīmīm̐di moha memisĕppemayyā
(||idi||)
māḍalāḍinaṁtalone maguvagum̐ gŏppu jārĕ
teḍalaina siggulĕllā dimmuvāsĕnu
pāḍiṁchi korigalĕllā bhāvāna nīriga lŏttĕ
kūḍuva nībai kāṁkṣhalu kŏlam̐diyedayyā
(||idi||)
daggarinayaṁtalone tadigŏnĕ nūrubulu
digganam̐ bayyadagŏṁgu digajārĕnu
aggamai śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
kaggudīra ninnum̐ gūḍĕ kaḍameḍadayyā