ఇదివో దంపతు లిద్దరు నున్నారు
(॥పల్లవి॥)
ఇదివో దంపతు లిద్దరు నున్నారు
వుదుటున దంతెపు టోవరిలోన
(॥ఇది॥)
పొందులమాఁటలఁ బొసఁగుముచ్చటలు
కందువకాఁగిటకల యికలు
విందులవమోవులవియ్యపుసన్నలు
అందెను తెరవెయ్యరే చెలులు
(॥ఇది॥)
చనవులమీరేటిసరపుఁజేఁతలు
తనియక పెనఁగేటి తమకములు
చెవకులలోపలి చిరుసిగ్గు లెసఁగె
అనువుగఁ దెరవేయరే చెలులు
(॥ఇది॥)
కెలయుచు నెఱిఁగినకేరేటినవ్వులు
కొలఁదిమిగులుబుసకొట్టులును
బలు శ్రీవేంకటేపతి కలమేల్‌మంగ -
కలవడే దెరవేయరే చెలులు
(||pallavi||)
idivo daṁpadu liddaru nunnāru
vuduḍuna daṁtĕbu ṭovarilona
(||idi||)
pŏṁdulamām̐ṭalam̐ bŏsam̐gumuchchaḍalu
kaṁduvagām̐giḍagala yigalu
viṁdulavamovulaviyyabusannalu
aṁdĕnu tĕravĕyyare sĕlulu
(||idi||)
sanavulamīreḍisarabum̐jem̐talu
taniyaga pĕnam̐geḍi tamagamulu
sĕvagulalobali sirusiggu lĕsam̐gĕ
anuvugam̐ dĕraveyare sĕlulu
(||idi||)
kĕlayusu nĕṟim̐ginagereḍinavvulu
kŏlam̐dimigulubusagŏṭṭulunu
balu śhrīveṁkaḍebadi kalamelmaṁga -
kalavaḍe dĕraveyare sĕlulu