ఇదిగో యలమేల్మంగ యింత బత్తి నీమీఁద
(॥పల్లవి॥)
ఇదిగో యలమేల్మంగ యింత బత్తి నీమీఁద
పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీని
(॥ఇది॥)
పడఁతి నీ గుణాలకు పలుమారు మెచ్చిమెచ్చి
వుడివోని సంతోసాన నోలలాడీని
కడు నీ చక్కఁదనాలు కాంతలతోఁ జెప్పి చెప్పి
వెడఁగుఁ బులకలతో విఱ్ఱవీఁగీని
(॥ఇది॥)
నేరుపుల మీచేఁతలు నెమ్మదిఁ జూచి చూచి
కోరికలు కొనసాగ గుబ్బతిలీని
కూరిమితోడుత నీ కొలువులు సేసి చేసి
చేరి నీతో వేడుకలఁ జెలరేఁగీని
(॥ఇది॥)
సేసవెట్టీ నీపై నిదె సెలవుల నవ్వి నవ్వి
ఆసలఁ గాఁగిట నిన్ను నప్పళించీన
రాసికెక్క నీ వేలఁగా రతుల శ్రీవేంకటేశ
పోసరించి యన్నిటాను భోగించీని
(||pallavi||)
idigo yalamelmaṁga yiṁta batti nīmīm̐da
pŏdigŏnna nīgu valabulu gummariṁchīni
(||idi||)
paḍam̐ti nī guṇālagu palumāru mĕchchimĕchchi
vuḍivoni saṁtosāna nolalāḍīni
kaḍu nī sakkam̐danālu kāṁtaladom̐ jĕppi sĕppi
vĕḍam̐gum̐ bulagalado viṭravīm̐gīni
(||idi||)
nerubula mīsem̐talu nĕmmadim̐ jūsi sūsi
korigalu kŏnasāga gubbadilīni
kūrimidoḍuda nī kŏluvulu sesi sesi
seri nīdo veḍugalam̐ jĕlarem̐gīni
(||idi||)
sesavĕṭṭī nībai nidĕ sĕlavula navvi navvi
āsalam̐ gām̐giḍa ninnu nappaḽiṁchīna
rāsigĕkka nī velam̐gā radula śhrīveṁkaḍeśha
posariṁchi yanniḍānu bhogiṁchīni