ఇదిగో విన్నవించితి మింతి లాగులు
(॥పల్లవి॥)
ఇదిగో విన్నవించితి మింతి లాగులు
అదనెరఁగి తలఁచి అలపార్చుకొనెను
(॥ఇది॥)
వొట్టిన నీపై విరహ మోరుచుకోలేక యింతి
గుట్టుతో జూజాలాడెఁ గొంతసేపు
అట్టె తన తమకము ఆఁపలేక ఇందాఁకా
దట్టమైన వనములోఁ దాపమార్చుకొనెను
(॥ఇది॥)
కమ్మి నీవు వచ్చేయాస గాలము గడపరాక
నెమ్మదిఁ గొంతవడి కిన్నెర మీటెను
కొమ్మల విన్నపా లియ్యకొనుదాఁకా వేగిరించి
తమ్మికొలఁకుల నీఁది దప్పి దేర్చుకొనెను
(॥ఇది॥)
భావములో నీ రూపు పట్టి పెనఁగఁగరాక
చేవమీర నేదురుచూచె గొంతవొద్దు
శ్రీవేంకటేశ నీవు చెందగా నలమేల్మంగ
సేవసేసి పాన్పుపై సేద దేర్చుకొనెను
(||pallavi||)
idigo vinnaviṁchidi miṁti lāgulu
adanĕram̐gi talam̐si alabārsugŏnĕnu
(||idi||)
vŏṭṭina nībai viraha morusugolega yiṁti
guṭṭudo jūjālāḍĕm̐ gŏṁtasebu
aṭṭĕ tana tamagamu ām̐palega iṁdām̐kā
daṭṭamaina vanamulom̐ dābamārsugŏnĕnu
(||idi||)
kammi nīvu vachcheyāsa gālamu gaḍabarāga
nĕmmadim̐ gŏṁtavaḍi kinnĕra mīḍĕnu
kŏmmala vinnabā liyyagŏnudām̐kā vegiriṁchi
tammigŏlam̐kula nīm̐di dappi dersugŏnĕnu
(||idi||)
bhāvamulo nī rūbu paṭṭi pĕnam̐gam̐garāga
sevamīra nedurusūsĕ gŏṁtavŏddu
śhrīveṁkaḍeśha nīvu sĕṁdagā nalamelmaṁga
sevasesi pānpubai seda dersugŏnĕnu