ఇదిగో నాగుణము; యెంతకు నేరవు నీవు
(॥పల్లవి॥)
ఇదిగో నాగుణము; యెంతకు నేరవు నీవు
పొదిగే నెంతవడైనా పొద్దువోదు నాకు
(॥ఇది॥)
చేరి నీవు నాకెంత చెప్పినట్లు సేయకున్నా
వూరటై యిచ్చకపునో తూరకుండదు
అరీతి బుద్దులు చెప్ప నందరూఁ గలరు నీకు
పోరాడనేమిటికి పొద్దువోదు నాకు
(॥ఇది॥)
యీవల నాచెనకులు ఇయ్యకోలు గాకుండినా
సేవసేసేనాచేతులు సిగ్గువడవు
వావితోసరసమాడేవారే నీకు మారెల్లా
వూవులు నీకు ముడిచేఁ బొద్దువోదు నాకు
(॥ఇది॥)
కందువ నీ విట్టే నన్నుఁ గాఁగిలించుకుండఁగాను
విందుల నామాసలు వీడుపడవు
సందడి శ్రీవేంకటేశ సారె నన్నుఁ గూడితివి
పొందునఁ దనియ నేను పొద్దువోదు నాకు
(||pallavi||)
idigo nāguṇamu; yĕṁtagu neravu nīvu
pŏdige nĕṁtavaḍainā pŏdduvodu nāgu
(||idi||)
seri nīvu nāgĕṁta sĕppinaṭlu seyagunnā
vūraḍai yichchagabuno tūraguṁḍadu
arīdi buddulu sĕppa naṁdarūm̐ galaru nīgu
porāḍanemiḍigi pŏdduvodu nāgu
(||idi||)
yīvala nāsĕnagulu iyyagolu gāguṁḍinā
sevasesenāsedulu sigguvaḍavu
vāvidosarasamāḍevāre nīgu mārĕllā
vūvulu nīgu muḍisem̐ bŏdduvodu nāgu
(||idi||)
kaṁduva nī viṭṭe nannum̐ gām̐giliṁchuguṁḍam̐gānu
viṁdula nāmāsalu vīḍubaḍavu
saṁdaḍi śhrīveṁkaḍeśha sārĕ nannum̐ gūḍidivi
pŏṁdunam̐ daniya nenu pŏdduvodu nāgu