Idi yokkadi vivegulagu yemchi soosi teliyamgaladi

ఇది యొక్కటి వివేకులకు యెంచి చూచి తెలియఁగలది
Language

(॥పల్లవి॥)
ఇది యొక్కటి వివేకులకు యెంచి చూచి తెలియఁగలది
అదన నిన్నంటినవారల నీ యంతలఁ జేతువు గాన

(॥ఇది॥)
బ్రహ్మాదిదివిజులకంటె నీ భక్తుఁడధికుఁడని చాటుట గాదా
బ్రహ్మలోకమునకంటెఁ బొడవున పట్టము గట్టితి ధృవునిని
బ్రహ్మ నీకంటెను నీదాస పరికరమె ఘనమను టిది గాదా
బ్రాహ్మణుఁడగు దుర్వాసుఁడంబరీషు పాదములకు మొక్కఁగఁజేసితివి

(॥ఇది॥)
కర్మమార్గములనుండే ఋషులకు కడయోగ్యుఁడు నీదాఁసుఁడనుచు
నర్మిలి ముందరి బ్రహ్మపట్ట మిది హనుమంతునికి కట్టితివి
ధర్మములోపల నెక్కుడు వైష్ణువ ధర్మమధిక మని తెలుపట గాదా
మర్మపు రాక్షసుఁడగు నా బలికిని మహిఁజెడని భోగము లిచ్చితివి

(॥ఇది॥)
నిఖిలవేదములకంటె నెక్కుడు నీ దాసునిమాటే యనుచు
శిఖరప్రతిష్టగా ప్రహ్లాదుని చేచేతనె పొడచూపితిని
సుఖులలోన నీ దాసుఁడే సుఖి యని శుకునకు మోక్షం బొసగితివి
మఖమూరితి శ్రీవేంకటేశ్వరుఁడ మాపాలిటనే దక్కితివి

(||pallavi||)
idi yŏkkaḍi vivegulagu yĕṁchi sūsi tĕliyam̐galadi
adana ninnaṁṭinavārala nī yaṁtalam̐ jeduvu gāna

(||idi||)
brahmādidivijulagaṁṭĕ nī bhaktum̐ḍadhigum̐ḍani sāḍuḍa gādā
brahmalogamunagaṁṭĕm̐ bŏḍavuna paṭṭamu gaṭṭidi dhṛvunini
brahma nīgaṁṭĕnu nīdāsa parigaramĕ ghanamanu ṭidi gādā
brāhmaṇum̐ḍagu durvāsum̐ḍaṁbarīṣhu pādamulagu mŏkkam̐gam̐jesidivi

(||idi||)
karmamārgamulanuṁḍe ṛṣhulagu kaḍayogyum̐ḍu nīdām̐sum̐ḍanusu
narmili muṁdari brahmabaṭṭa midi hanumaṁtunigi kaṭṭidivi
dharmamulobala nĕkkuḍu vaiṣhṇuva dharmamadhiga mani tĕlubaḍa gādā
marmabu rākṣhasum̐ḍagu nā baligini mahim̐jĕḍani bhogamu lichchidivi

(||idi||)
nikhilavedamulagaṁṭĕ nĕkkuḍu nī dāsunimāḍe yanusu
śhikharapradiṣhṭagā prahlāduni sesedanĕ pŏḍasūbidini
sukhulalona nī dāsum̐ḍe sukhi yani śhugunagu mokṣhaṁ bŏsagidivi
makhamūridi śhrīveṁkaḍeśhvarum̐ḍa mābāliḍane dakkidivi