Idi yemtidayyaa yemtasesidivi neevu

ఇది యేఁటిదయ్యా యెంతసేసితివి నీవు
Language

(॥పల్లవి॥)
ఇది యేఁటిదయ్యా యెంతసేసితివి నీవు
చెదరని దయతో విచ్చేయవయ్య యింటికి

(॥ఇది॥)
చెలులతో యేమని చెప్పెంపితివి
యెలమి నానవాలు యేమిచ్చితివి
కులికి యేమని యాసకొలిపితివి
చెలిని మన్నింతువు విచ్చేయవయ్య యింటికి

(॥ఇది॥)
చెప్పరానిసన్న లేమి సేసితివి
తప్పకేల కొనగోరఁ దాఁకించితివి
చొప్పుగా నేమని నీమోవి చూపితివి
చిప్పిలఁ గూడుదువు విచ్చేయవయ్య యింటికి

(॥ఇది॥)
నావద్దనుండాపె నెట్టు నవ్వించితివి
యేవిధానఁ దొల్లేమని యేలుకొంటివి
శ్రీవేంకటేశ మాయింతిఁ జేరి కూడితి
సేవగొందువు మాచే విచ్చేయవయ్య యింటికి

(||pallavi||)
idi yem̐ṭidayyā yĕṁtasesidivi nīvu
sĕdarani dayado vichcheyavayya yiṁṭigi

(||idi||)
sĕlulado yemani sĕppĕṁpidivi
yĕlami nānavālu yemichchidivi
kuligi yemani yāsagŏlibidivi
sĕlini manniṁtuvu vichcheyavayya yiṁṭigi

(||idi||)
sĕpparānisanna lemi sesidivi
tappagela kŏnagoram̐ dām̐kiṁchidivi
sŏppugā nemani nīmovi sūbidivi
sippilam̐ gūḍuduvu vichcheyavayya yiṁṭigi

(||idi||)
nāvaddanuṁḍābĕ nĕṭṭu navviṁchidivi
yevidhānam̐ dŏllemani yelugŏṁṭivi
śhrīveṁkaḍeśha māyiṁtim̐ jeri kūḍidi
sevagŏṁduvu māse vichcheyavayya yiṁṭigi