Idi yemtagarviyani yemchevuganaga neevu

ఇది యెంతగర్వియని యెంచేవుగనక నీవు
Language

(॥పల్లవి॥)
ఇది యెంతగర్వియని యెంచేవుగనక నీవు
మది నింతయును నీమన్ననే సుమ్మీ

(॥ఇది॥)
ఆఁటదానఁగనక నిన్నటు సొలయుదుఁగాక
గాఁటాన నే నుండేది నీకరుణేకాదా
వీటిలో చవులువుట్ట వెంగెములాడుదుఁగాక
నీటున నే మెలఁగేది నీలాలనేకాదా

(॥ఇది॥)
జవ్వనిఁగనక నిన్ను సాదించి జంకింతుఁగాక
చివ్వన నావలపు నీచేతిదే కాదా
నవ్వుతా నీకిచ్చకమునకుఁ బెనఁగుదుఁగాక
రవ్వల నానేరుపు నీరచనేకాదా

(॥ఇది॥)
అలమేల్ మంగఁగనక ఆసకొలుపుదుఁగాక
కలుగునాపంతము నీఘనతేకాదా
వెలయ శ్రీవేంకటేశ వినోదము సేతుఁగాక
నలిగెతో నారతి నీ సమ్మతేకాదా

(||pallavi||)
idi yĕṁtagarviyani yĕṁchevuganaga nīvu
madi niṁtayunu nīmannane summī

(||idi||)
ām̐ṭadānam̐ganaga ninnaḍu sŏlayudum̐gāga
gām̐ṭāna ne nuṁḍedi nīgaruṇegādā
vīḍilo savuluvuṭṭa vĕṁgĕmulāḍudum̐gāga
nīḍuna ne mĕlam̐gedi nīlālanegādā

(||idi||)
javvanim̐ganaga ninnu sādiṁchi jaṁkiṁtum̐gāga
sivvana nāvalabu nīsedide kādā
navvudā nīgichchagamunagum̐ bĕnam̐gudum̐gāga
ravvala nānerubu nīrasanegādā

(||idi||)
alamel maṁgam̐ganaga āsagŏlubudum̐gāga
kalugunābaṁtamu nīghanadegādā
vĕlaya śhrīveṁkaḍeśha vinodamu sedum̐gāga
naligĕdo nāradi nī sammadegādā