ఇది యెంతగర్వియని యెంచేవు గనక నన్ను
(॥పల్లవి॥)
ఇది యెంతగర్వియని యెంచేవు గనక నన్ను
పెదవుల తుదలనే పిలిచితిఁ జుమ్మీ
(॥ఇది॥)
కన్నుల మొక్కితిఁజుమ్మీ గక్కన నీకు నేను
కిన్నెర వాయించుకొంటా కెంగేలను
సన్నలుచేసితిఁజుమ్మీ సముకాననే యప్పడు
చిన్నిచిన్నినగవులసిగ్గుతోడను
(॥ఇది॥)
అంది చోటిచ్చిఁతి జుమ్మీ అండనే నీకు నేను
గందము వూసుకొంటా గద్దెమీఁదను
విందులూఁ జెప్పితిఁజుమ్మీ వేడుకతోడ నిలిచి
మందలించి చెలికత్తెమాఁటుననే వుండి
(॥ఇది॥)
యెదురుకొంటిఁజుమ్మీ ఇంపులచూపుల నీకు
ముదమున నాతురుము ముడుచుకొంటా
ఇదివో శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కదిసితి విటునన్ను కడు సంతోసించితి
(||pallavi||)
idi yĕṁtagarviyani yĕṁchevu ganaga nannu
pĕdavula tudalane pilisidim̐ jummī
(||idi||)
kannula mŏkkidim̐jummī gakkana nīgu nenu
kinnĕra vāyiṁchugŏṁṭā kĕṁgelanu
sannalusesidim̐jummī samugānane yappaḍu
sinnisinninagavulasiggudoḍanu
(||idi||)
aṁdi soḍichchim̐ti jummī aṁḍane nīgu nenu
gaṁdamu vūsugŏṁṭā gaddĕmīm̐danu
viṁdulūm̐ jĕppidim̐jummī veḍugadoḍa nilisi
maṁdaliṁchi sĕligattĕmām̐ṭunane vuṁḍi
(||idi||)
yĕdurugŏṁṭim̐jummī iṁpulasūbula nīgu
mudamuna nādurumu muḍusugŏṁṭā
idivo śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kadisidi viḍunannu kaḍu saṁtosiṁchidi