ఇది యెంతగా బోదించె యెవ్వతో నీకు
(॥పల్లవి॥)
ఇది యెంతగా బోదించె యెవ్వతో నీకు
అదనాయఁ దెరలోని కంకెల రావయ్య
(॥ఇది॥)
సాదాలుపిసికేదాన పైపై నిందలాడేనా
లేదుసుమీనీగుణాలు లెక్కవెట్టితి
సాదనై మొక్కేచేత సారె గోరుదీసేనా
సేదదేర మేలుతోడ చెక్కులు దువ్వితిని
(॥ఇది॥)
నీకు నాలనైనదాన నేఁ బంతాలు చూపేనా
నాకున సత్తువచూడవలె నంటివి
కైకొని మోవియిచ్చి కారములుచూపేనా
కోకొమ్మని తేనెలకు గుంటలు సేసితిని
(॥ఇది॥)
వూడిగపుదాన నీపై వొగిఁ బాదము చాఁచేనా
వాడికరతుల నిన్ను వలపించితి
కూడితి శ్రీవేంకటేశ కొసరులు నెరపేనా
వీడెములోనివిందులు వీడుదోడాడితిని
(||pallavi||)
idi yĕṁtagā bodiṁchĕ yĕvvado nīgu
adanāyam̐ dĕraloni kaṁkĕla rāvayya
(||idi||)
sādālubisigedāna paibai niṁdalāḍenā
ledusumīnīguṇālu lĕkkavĕṭṭidi
sādanai mŏkkeseda sārĕ gorudīsenā
sedadera meludoḍa sĕkkulu duvvidini
(||idi||)
nīgu nālanainadāna nem̐ baṁtālu sūbenā
nāguna sattuvasūḍavalĕ naṁṭivi
kaigŏni moviyichchi kāramulusūbenā
kogŏmmani tenĕlagu guṁṭalu sesidini
(||idi||)
vūḍigabudāna nībai vŏgim̐ bādamu sām̐senā
vāḍigaradula ninnu valabiṁchidi
kūḍidi śhrīveṁkaḍeśha kŏsarulu nĕrabenā
vīḍĕmuloniviṁdulu vīḍudoḍāḍidini