ఇది యెంత గబ్బియని యెంచకువయ్యా
(॥పల్లవి॥)
ఇది యెంత గబ్బియని యెంచకువయ్యా
కదిసి పట్టపుదేవిఁగా నన్ను నేలితివి
(॥ఇది॥)
పొందుగలవారికి పోరపోచ్చములు లేవు
మందెమేళమెఁతైనా సమ్మతులేకాని
చెంది యేకతాన నుంటే సిగ్గులు పనికిరావు
సందడింపుఁ దమకము చవిరేఁచుఁగాని
(॥ఇది॥)
వాడికైనవారికె వాసివంతు లెక్కడివి
జోడై యెంతపెనఁగినా సొంపలౌఁగాని
కూడిమాడి వుండితేను కొంకుగొసరులు రావు
వీడనిమోవితీవులు వేడుకలౌఁగాని
(॥ఇది॥)
సతమైలవారికి చలములు నిగుడవు
మితిమీరఁ గూడినాను మేలేయౌఁగాని
ఇతవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
తతి నీనాకూటమి తారుకాణౌఁగాని
(||pallavi||)
idi yĕṁta gabbiyani yĕṁchaguvayyā
kadisi paṭṭabudevim̐gā nannu nelidivi
(||idi||)
pŏṁdugalavārigi porabochchamulu levu
maṁdĕmeḽamĕm̐tainā sammadulegāni
sĕṁdi yegadāna nuṁṭe siggulu panigirāvu
saṁdaḍiṁpum̐ damagamu savirem̐sum̐gāni
(||idi||)
vāḍigainavārigĕ vāsivaṁtu lĕkkaḍivi
joḍai yĕṁtabĕnam̐ginā sŏṁpalaum̐gāni
kūḍimāḍi vuṁḍidenu kŏṁkugŏsarulu rāvu
vīḍanimovidīvulu veḍugalaum̐gāni
(||idi||)
sadamailavārigi salamulu niguḍavu
midimīram̐ gūḍinānu meleyaum̐gāni
idavai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
tadi nīnāgūḍami tārugāṇaum̐gāni