Idi yemi neebhaavamu yimti seppamgadave

ఇది యేమి నీభావము యింతి చెప్పఁగదవే
Language

(॥పల్లవి॥)
ఇది యేమి నీభావము యింతి చెప్పఁగదవే
మది నీ కిచ్చిన బాస మఱపాయనా

(॥ఇదియే॥)
వెన్నెలఁగాయఁగా జూచి వెంబాలవెల్లి యనేవు
తన్నుఁ దానే పతిరాక తడసెనటే
పన్నుగాఁ గోవిలఁ జూచి పంపుడుభూత మనేవు
పన్ని యాతఁ డెక్కడికో పరా కాయెనా

(॥ఇదియే॥)
మానిపై చిగుళ్ళు చూచి మంట లంటా బెదరేవు
ఆనుకొని యాన చెప్పి అంపఁడటవే
పూని యలుల నాళవుంటుంట లంటాఁ గసరేవు
లోనికి వచ్చి యతఁడు లోను గాఁ డాయవా

(॥ఇదియే॥)
హత్తి మల్లెమొగ్గ చూచి అదె పెట్లుగుం డనేవు
చిత్తజగురుఁడు యింత సేసెనటవే
అత్తల శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
కొత్తగా ని న్నేలెఁ దనకూరిమి దలఁచేనా

(||pallavi||)
idi yemi nībhāvamu yiṁti sĕppam̐gadave
madi nī kichchina bāsa maṟabāyanā

(||idiye||)
vĕnnĕlam̐gāyam̐gā jūsi vĕṁbālavĕlli yanevu
tannum̐ dāne padirāga taḍasĕnaḍe
pannugām̐ govilam̐ jūsi paṁpuḍubhūda manevu
panni yādam̐ ḍĕkkaḍigo parā kāyĕnā

(||idiye||)
mānibai siguḽḽu sūsi maṁṭa laṁṭā bĕdarevu
ānugŏni yāna sĕppi aṁpam̐ḍaḍave
pūni yalula nāḽavuṁṭuṁṭa laṁṭām̐ gasarevu
lonigi vachchi yadam̐ḍu lonu gām̐ ḍāyavā

(||idiye||)
hatti mallĕmŏgga sūsi adĕ pĕṭluguṁ ḍanevu
sittajagurum̐ḍu yiṁta sesĕnaḍave
attala śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
kŏttagā ni nnelĕm̐ danagūrimi dalam̐senā