ఇది యెగ్గని చూడకు మింతిపై నీవు
(॥పల్లవి॥)
ఇది యెగ్గని చూడకు మింతిపై నీవు
వెదకే విూ యిద్దరికి వినోదము గాకా
(॥ఇది॥)
జలజాక్షిగన నీవు చంద్రగావి గట్టఁ గాను
వలనై చూడక తలవంచెఁ గాకా
కులికి నీమీఁద నంత కోపమా చెలియకు
వొలిసి యొండొకటికి నొంటదని కాకా
(॥ఇది॥)
కోకిలవాణిగనక కోరి మేఘవర్ణ మైతే
నాకె నీతో మాటలాడ దాయఁ గాక
జోకల మీయిద్దరిలో సూడుఁబాడుపగలా
సైకమై యీరెంటికిఁ బొసగదని కాక
(॥ఇది॥)
జక్కవకుచగనక చంద్రాభరణవు ని
న్నిక్కడ జూచి కొంకీ నింతే కాక
చొక్కపు శ్రీవేంకటేశ సూర్యునిలో నుండే నిన్ను
తక్కక వుండనిదే తగ లౌనే కాకా
(||pallavi||)
idi yĕggani sūḍagu miṁtibai nīvu
vĕdage viూ yiddarigi vinodamu gāgā
(||idi||)
jalajākṣhigana nīvu saṁdragāvi gaṭṭam̐ gānu
valanai sūḍaga talavaṁchĕm̐ gāgā
kuligi nīmīm̐da naṁta kobamā sĕliyagu
vŏlisi yŏṁḍŏgaḍigi nŏṁṭadani kāgā
(||idi||)
kogilavāṇiganaga kori meghavarṇa maide
nāgĕ nīdo māḍalāḍa dāyam̐ gāga
jogala mīyiddarilo sūḍum̐bāḍubagalā
saigamai yīrĕṁṭigim̐ bŏsagadani kāga
(||idi||)
jakkavagusaganaga saṁdrābharaṇavu ni
nnikkaḍa jūsi kŏṁkī niṁte kāga
sŏkkabu śhrīveṁkaḍeśha sūryunilo nuṁḍe ninnu
takkaga vuṁḍanide taga laune kāgā