ఇది విచారించవద్దా యేల మానితివో కాక
(॥పల్లవి॥)
ఇది విచారించవద్దా యేల మానితివో కాక
పదరీవో రమణుఁడ పరాకైతి గాకా
(॥ఇది॥)
నీమేనిచెమటనీట నిండిన నావిరహగ్ని
ఆముకొని యారవద్దా ఆరదు గాక
మోముచంద్రకళలకు ముంచీ నా మతి చీఁకటి
యేమైనాఁ బాయఁ గద్దా యెక్కుడయ్యీఁ గాకా
(॥ఇది॥)
మోవిపై చుక్కలు చూచి ముంచీ కన్నుఁ గలువలు
వేవేగఁవిచ్చఁగవద్దా విచ్చవు గాక
తావినీవూర్పుగాలికిఁ దగునా కన్నీటినీరు
యీవేళ నింకవలదా యింకదాయఁ గాకా
(॥ఇది॥)
గందపు నీమేని మీఁద గమ్మీ నా బాహులతలు
అందిఁపై బారఁగవద్దా అందపు గాఁక
యిందులోనే శ్రీవేంకటేశ నన్ను గూడితివి
ముందు బాసగొనవద్దా మొకమోట గాకా
(||pallavi||)
idi visāriṁchavaddā yela mānidivo kāga
padarīvo ramaṇum̐ḍa parāgaidi gāgā
(||idi||)
nīmenisĕmaḍanīḍa niṁḍina nāvirahagni
āmugŏni yāravaddā āradu gāga
momusaṁdragaḽalagu muṁchī nā madi sīm̐kaḍi
yemainām̐ bāyam̐ gaddā yĕkkuḍayyīm̐ gāgā
(||idi||)
movibai sukkalu sūsi muṁchī kannum̐ galuvalu
vevegam̐vichcham̐gavaddā vichchavu gāga
tāvinīvūrbugāligim̐ dagunā kannīḍinīru
yīveḽa niṁkavaladā yiṁkadāyam̐ gāgā
(||idi||)
gaṁdabu nīmeni mīm̐da gammī nā bāhuladalu
aṁdim̐pai bāram̐gavaddā aṁdabu gām̐ka
yiṁdulone śhrīveṁkaḍeśha nannu gūḍidivi
muṁdu bāsagŏnavaddā mŏgamoḍa gāgā