Idi tuda modalani yeṟumga revvarunu

ఇది తుద మొదలని యెఱుఁగ రెవ్వరును
Language

(॥పల్లవి॥)
ఇది తుద మొదలని యెఱుఁగ రెవ్వరును
యెదుట నీ మహిమ యెంతని తలఁతు

(॥ఇది॥)
తరణిచంద్రుల రధంబుల వెంటను
గరిమలఁ దిరిగీ కాలమూ
వురవడిఁ బ్రాణుల నూర్పులవెంబడి
నరుదుగ మెఱసీ నాయుష్యములు

(॥ఇది॥)
నెలకొని యెండల నీడల దండనె
తెలుపుచుఁ బొదలే దినములు
వెలయఁగఁ జీకటి వెన్నెలమాటున
మలసీ సారెకు మాసములు

(॥ఇది॥)
వానలశీతున వాయుమార్గమున
యీనుచు నున్నవి యేండ్లు
తానక మైనది తలఁపఁగ నీయందు
శ్రీనిధి చూడవే శ్రీవేంకటేశ

(||pallavi||)
idi tuda mŏdalani yĕṟum̐ga rĕvvarunu
yĕduḍa nī mahima yĕṁtani talam̐tu

(||idi||)
taraṇisaṁdrula radhaṁbula vĕṁṭanu
garimalam̐ dirigī kālamū
vuravaḍim̐ brāṇula nūrbulavĕṁbaḍi
naruduga mĕṟasī nāyuṣhyamulu

(||idi||)
nĕlagŏni yĕṁḍala nīḍala daṁḍanĕ
tĕlubusum̐ bŏdale dinamulu
vĕlayam̐gam̐ jīgaḍi vĕnnĕlamāḍuna
malasī sārĕgu māsamulu

(||idi||)
vānalaśhīduna vāyumārgamuna
yīnusu nunnavi yeṁḍlu
tānaga mainadi talam̐pam̐ga nīyaṁdu
śhrīnidhi sūḍave śhrīveṁkaḍeśha