Idi neegu nubagaara mimtagaa nem jesidi

ఇది నీకు నుపకార మింతగా నేఁ జేసితి
Language

(॥పల్లవి॥)
ఇది నీకు నుపకార మింతగా నేఁ జేసితి
కదిసి యీ మేలెంచి కావుమీ నన్ను

(॥ఇది॥)
భూమి నే నొక్కనీచుఁడఁ బుట్టఁగాఁ గదా మీ దయ
వేమారు నా మీఁదఁ బారి వెల లెట్టెను
నేమపుఁ బుణ్యుఁడ నైతే నీ దయకుఁ బాత్రమేది
యేమిటికి రాక మూల నిట వృధావుండుఁగా

(॥ఇది॥)
పుట్టుదరిద్రవు నాకు పొంచి సంపదలియ్యఁగా
యిట్టె నీ లక్ష్మీపతిత్వ మెన్నికె కెక్కె
నెట్టన శ్రీవేంకటేశ నీ దాసుల కతాననే
రట్టు కెక్కె పంతము మీఱఁగ రాజ వైతివి

(॥ఇది॥)
చిక్కి నే దోషాలు గడుఁ జేయఁగాఁ గా నీ నామము
రొక్కముగా నన్నుఁ గాచి రూఢి కెక్కెను
దిక్కుల మా వంటి వారి తెగువ సేయ కుండితే
యెక్కడ నుండు నీ నామ మే మందునకు వచ్చు

(||pallavi||)
idi nīgu nubagāra miṁtagā nem̐ jesidi
kadisi yī melĕṁchi kāvumī nannu

(||idi||)
bhūmi ne nŏkkanīsum̐ḍam̐ buṭṭam̐gām̐ gadā mī daya
vemāru nā mīm̐dam̐ bāri vĕla lĕṭṭĕnu
nemabum̐ buṇyum̐ḍa naide nī dayagum̐ bātramedi
yemiḍigi rāga mūla niḍa vṛdhāvuṁḍum̐gā

(||idi||)
puṭṭudaridravu nāgu pŏṁchi saṁpadaliyyam̐gā
yiṭṭĕ nī lakṣhmībaditva mĕnnigĕ kĕkkĕ
nĕṭṭana śhrīveṁkaḍeśha nī dāsula kadānane
raṭṭu kĕkkĕ paṁtamu mīṟam̐ga rāja vaidivi

(||idi||)
sikki ne doṣhālu gaḍum̐ jeyam̐gām̐ gā nī nāmamu
rŏkkamugā nannum̐ gāsi rūḍhi kĕkkĕnu
dikkula mā vaṁṭi vāri tĕguva seya kuṁḍide
yĕkkaḍa nuṁḍu nī nāma me maṁdunagu vachchu