Idi nee peddarigame yeṟumgugommee

ఇది నీ పెద్దరికమే యెఱుఁగుకొమ్మీ
Language

(॥పల్లవి॥)
ఇది నీ పెద్దరికమే యెఱుఁగుకొమ్మీ
పదిలానఁ గప్పేది నీ పచ్చడమే నేను

(॥ఇది॥)
చెనకి విభుడ నీవు చెప్పినట్టు సేయఁగాను
మునుకొని సవతులు మొక్కఁగాను
నినుపు గర్వముతోడ నీవు వచ్చే దెఱఁగక
వొనరి మంచము మీఁద నుందాన నెమ్మదిని

(॥ఇది॥)
చింతదీర నీ సొమ్ములు చేరి నామేన నుండఁగా
పంతపు నీపై పదాలు పాడి మెచ్చఁగా
ఇంతట నీవు నమ్మిన దెఱఁగక పరాకున
యింతిపైఁ గాళ్లు చాఁచుక యెమ్మెతో నుందానను

(॥ఇది॥)
శ్రీ వేంకటేశ నీవు చేయివేసి నన్నుఁగూడఁగా
భావించి చిలుకలట్టె పలుకఁగాను
యీవలఁ జెక్కునొక్కిన దెఱఁగక నీ మీద
కావిరిఁ జన్నులు మోవి కడు నూఁదె నిపుడు

(||pallavi||)
idi nī pĕddarigame yĕṟum̐gugŏmmī
padilānam̐ gappedi nī pachchaḍame nenu

(||idi||)
sĕnagi vibhuḍa nīvu sĕppinaṭṭu seyam̐gānu
munugŏni savadulu mŏkkam̐gānu
ninubu garvamudoḍa nīvu vachche dĕṟam̐gaga
vŏnari maṁchamu mīm̐da nuṁdāna nĕmmadini

(||idi||)
siṁtadīra nī sŏmmulu seri nāmena nuṁḍam̐gā
paṁtabu nībai padālu pāḍi mĕchcham̐gā
iṁtaḍa nīvu nammina dĕṟam̐gaga parāguna
yiṁtibaim̐ gāḽlu sām̐suga yĕmmĕdo nuṁdānanu

(||idi||)
śhrī veṁkaḍeśha nīvu seyivesi nannum̐gūḍam̐gā
bhāviṁchi silugalaṭṭĕ palugam̐gānu
yīvalam̐ jĕkkunŏkkina dĕṟam̐gaga nī mīda
kāvirim̐ jannulu movi kaḍu nūm̐dĕ nibuḍu