ఇది మా వేడుక గాదా యేల మాకు దాఁచేవు
(॥పల్లవి॥)
ఇది మా వేడుక గాదా యేల మాకు దాఁచేవు
వెదకఁ బోయిన తీగె యెదురుగా వచ్చెను
(॥ఇది॥)
చిప్పిలుఁగళలతోడ చిరుఁ జెమటలతోడ
దప్పిదేరే వదేమె తరుణి నీవు
యెప్పటి చందము గాదు ఇప్పుటున్న నీ భావము
చెప్పఁగదవే మాతోను సిగ్గులేల ఇఁకను
(॥ఇది॥)
చొక్కుదేరే కన్నులతో సొరిది నిట్టూర్పులతో
మిక్కిలి యలసేవేమే మెలుఁత నీవు
యెక్కడ నబ్బెనోకాని యిటువంటి నీ సొబగు
నిక్కము చెప్పఁగదవే నీవేలకొంకేవు
(॥ఇది॥)
వీడిన తురుముతోడ వెన్నెల నవ్వులతోడ
వేడుక నెరసేవేమే వెలఁదినీవు
నే(నేఁ)డు శ్రీవేంకటేశుఁడు నిన్ను రతిఁ గూడెనటె
వోడక చెప్పఁగదవే వొద్దికతో మాకు
(||pallavi||)
idi mā veḍuga gādā yela māgu dām̐sevu
vĕdagam̐ boyina tīgĕ yĕdurugā vachchĕnu
(||idi||)
sippilum̐gaḽaladoḍa sirum̐ jĕmaḍaladoḍa
dappidere vademĕ taruṇi nīvu
yĕppaḍi saṁdamu gādu ippuḍunna nī bhāvamu
sĕppam̐gadave mādonu siggulela im̐kanu
(||idi||)
sŏkkudere kannulado sŏridi niṭṭūrbulado
mikkili yalaseveme mĕlum̐ta nīvu
yĕkkaḍa nabbĕnogāni yiḍuvaṁṭi nī sŏbagu
nikkamu sĕppam̐gadave nīvelagŏṁkevu
(||idi||)
vīḍina turumudoḍa vĕnnĕla navvuladoḍa
veḍuga nĕraseveme vĕlam̐dinīvu
ne(nem̐)ḍu śhrīveṁkaḍeśhum̐ḍu ninnu radim̐ gūḍĕnaḍĕ
voḍaga sĕppam̐gadave vŏddigado māgu