Idi itlanauda ne neṟamga gaaga

ఇది ఇట్లనౌత నే నెఱఁగ గాక
Language

(॥పల్లవి॥)
ఇది ఇట్లనౌత నే నెఱఁగ గాక
తుదిముట్ట నప్పుడే తోవ గనుకొననా

(॥ఇది॥)
సొగసి నా కడియాస చూపేరుగాక ననుఁ
దగిలి నిక్కము నతడు దాఁ దలఁచెనా
మిగుల మీమాట నమ్మితిఁగాక ఇంతలో
మగుడ నే నొకతెగువ మది నెంచుకొననా

(॥ఇది॥)
యెడమాటలోననే యేమితమకమోకాక
వెడఁగుబతి విచ్చేయ వేళలేదా
బడలితిరి చాలు నిఁక బట్టుకున్నప్పుడే
అడరి నాలో వలపనట్లనే కానా

(॥ఇది॥)
చెలఁగి నామనసుఁ దెలిసితిరి మీ రిటుగాక
సొలసి శ్రీవేంకటేశుడు మానునా
చెలులాల మీపలుకు చెల్లె నే మిద్దరముఁ
గలసితిమి యిట్లైతే గలకలన నగనా

(||pallavi||)
idi iṭlanauda ne nĕṟam̐ga gāga
tudimuṭṭa nappuḍe tova ganugŏnanā

(||idi||)
sŏgasi nā kaḍiyāsa sūberugāga nanum̐
dagili nikkamu nadaḍu dām̐ dalam̐sĕnā
migula mīmāḍa nammidim̐gāga iṁtalo
maguḍa ne nŏgadĕguva madi nĕṁchugŏnanā

(||idi||)
yĕḍamāḍalonane yemidamagamogāga
vĕḍam̐gubadi vichcheya veḽaledā
baḍalidiri sālu nim̐ka baṭṭugunnappuḍe
aḍari nālo valabanaṭlane kānā

(||idi||)
sĕlam̐gi nāmanasum̐ dĕlisidiri mī riḍugāga
sŏlasi śhrīveṁkaḍeśhuḍu mānunā
sĕlulāla mībalugu sĕllĕ ne middaramum̐
galasidimi yiṭlaide galagalana naganā