ఇది గొంతవలెనా యిందుకుఁ దోడు
(॥పల్లవి॥)
ఇది గొంతవలెనా యిందుకుఁ దోడు
మదనమెత్తించీ నన్ను మంచివానివలెనే
(॥ఇది॥)
అచ్చలానఁ దన్ను జూడ ఆడకు నే రాఁగానే
ఇచ్చటికేల విచ్చేసె నింతలోఁదాను
కచ్చుపెట్టి విన్నవారు గర్వియని నన్నందురు
మచ్చిక నెఁతసేసీనే మంచివానివలెనే
(॥ఇది॥)
చేకొని తన్నుఁజూచి చేతులెత్తి మొక్కఁగానే
వాకునఁ దానేల మొక్కె వద్దంటాఁ దాను
యీకడ లోకమువారు యెంతటిది ఇదనరా
మా కెంతదూర గట్టీనే మంచివానివలెనే
(॥ఇది॥)
తిరమై తనవారమై తెరలోని కేఁగఁగానే
సరుగఁ గాఁగిట నించె సరుసఁ దాను
అరుదై శ్రీ వేంకటేశుఁ డౌనే నన్ను నిటు గూడి
మరిగించె నిన్నిటాను మంచివానిలెనే
(||pallavi||)
idi gŏṁtavalĕnā yiṁdugum̐ doḍu
madanamĕttiṁchī nannu maṁchivānivalĕne
(||idi||)
achchalānam̐ dannu jūḍa āḍagu ne rām̐gāne
ichchaḍigela vichchesĕ niṁtalom̐dānu
kachchubĕṭṭi vinnavāru garviyani nannaṁduru
machchiga nĕm̐tasesīne maṁchivānivalĕne
(||idi||)
segŏni tannum̐jūsi sedulĕtti mŏkkam̐gāne
vāgunam̐ dānela mŏkkĕ vaddaṁṭām̐ dānu
yīgaḍa logamuvāru yĕṁtaḍidi idanarā
mā kĕṁtadūra gaṭṭīne maṁchivānivalĕne
(||idi||)
tiramai tanavāramai tĕraloni kem̐gam̐gāne
sarugam̐ gām̐giḍa niṁchĕ sarusam̐ dānu
arudai śhrī veṁkaḍeśhum̐ ḍaune nannu niḍu gūḍi
marigiṁchĕ ninniḍānu maṁchivānilĕne