Idi gaadu teruvu yeederevaarigi

ఇది గాదు తెరువు యీడేరేవారికి
Language

(॥పల్లవి॥)
ఇది గాదు తెరువు యీడేరేవారికి
అదన విజ్ఞానియైతే అతఁడే రక్షించును

(॥ఇది॥)
తలఁపులు చక్కఁగాక దైవముఁ దలఁచఁబోతే
వెలి దున్నని నేలను విత్తిన యట్లు
పొలసి దాసుఁడుగాక పూజించఁ బోవు టెల్ల
బలిమి దేవునిఁ బట్టి బంటకు నాఁగుటా

(॥ఇది॥)
తనవైరాగ్యము లేక తత్త్వము వెదకేనంటే
తనియ కిసుక పాఁతర దవ్వుటా
కొనభక్తిలేక హరిఁగోరి మొక్కు టెల్ల
మొనసి దేవుని సొమ్ము ముచ్చిలించుకొనుటా

(॥ఇది॥)
వెస గురుఁడు లేక శ్రీ వేంకటేశు సాధించితే
అసదై(?) యందనిపంటి కఱ్ఱు చాఁచుట
పసగా నితనిఁ దనపనికిఁగాఁ బొగడుట
యిసుమంత చెలమకు యేతము లెట్టుటా

(||pallavi||)
idi gādu tĕruvu yīḍerevārigi
adana vijñāniyaide adam̐ḍe rakṣhiṁchunu

(||idi||)
talam̐pulu sakkam̐gāga daivamum̐ dalam̐sam̐bode
vĕli dunnani nelanu vittina yaṭlu
pŏlasi dāsum̐ḍugāga pūjiṁcham̐ bovu ṭĕlla
balimi devunim̐ baṭṭi baṁṭagu nām̐guḍā

(||idi||)
tanavairāgyamu lega tattvamu vĕdagenaṁṭe
taniya kisuga pām̐tara davvuḍā
kŏnabhaktilega harim̐gori mŏkku ṭĕlla
mŏnasi devuni sŏmmu muchchiliṁchugŏnuḍā

(||idi||)
vĕsa gurum̐ḍu lega śhrī veṁkaḍeśhu sādhiṁchide
asadai(?) yaṁdanibaṁṭi kaṭru sām̐suḍa
pasagā nidanim̐ danabanigim̐gām̐ bŏgaḍuḍa
yisumaṁta sĕlamagu yedamu lĕṭṭuḍā