ఇది దా నెఱఁగడా ఇంపుల నా రమణుడు
(॥పల్లవి॥)
ఇది దా నెఱఁగడా ఇంపుల నా రమణుడు
హృదయమే యెఱుఁగును యెంచి చెప్పేదేమే
(॥ఇది॥)
దవ్వు విచారింతురా తమ్మువలసినవారు
యెవ్వల నుండినాఁ గూడనెంతురుగాక
దవ్వుల సూర్యునికి ధరణిఁ దామరలకు
యెవ్వరైనాఁ బొందునేసి యెనఇంచిరా
(॥ఇది॥)
వెనకముందెంతురా వెక్కసపు పొందువారు
యెనలేనిసాహసము లెంతురుగాక
వినువీథిఁ జఁద్రుడుండ వె జంద్రకాంతము
లెనసి కదగుమని యెవ్వరైనాఁ జెప్పిరా
(॥ఇది॥)
వొకరి నడుగుదురా వుల్లములు గలసితే
వొకట్గె రతులఁ గూడివుందురుగాక
ప్రకటించి శ్రీవేంకటపతి దానె నన్నుఁ గూడె
సకలము లోలోనె సంతమౌటగాక
(||pallavi||)
idi dā nĕṟam̐gaḍā iṁpula nā ramaṇuḍu
hṛdayame yĕṟum̐gunu yĕṁchi sĕppedeme
(||idi||)
davvu visāriṁturā tammuvalasinavāru
yĕvvala nuṁḍinām̐ gūḍanĕṁturugāga
davvula sūryunigi dharaṇim̐ dāmaralagu
yĕvvarainām̐ bŏṁdunesi yĕna̮iṁchirā
(||idi||)
vĕnagamuṁdĕṁturā vĕkkasabu pŏṁduvāru
yĕnalenisāhasamu lĕṁturugāga
vinuvīthim̐ jam̐druḍuṁḍa vĕ jaṁdragāṁtamu
lĕnasi kadagumani yĕvvarainām̐ jĕppirā
(||idi||)
vŏgari naḍugudurā vullamulu galaside
vŏgaṭgĕ radulam̐ gūḍivuṁdurugāga
pragaḍiṁchi śhrīveṁkaḍabadi dānĕ nannum̐ gūḍĕ
sagalamu lolonĕ saṁtamauḍagāga