Idi daa naa valabamtaa yeedusoobeene

ఇది దా నా వలపంటా యీడుచూపీనే
Language

(॥పల్లవి॥)
ఇది దా నా వలపంటా యీడుచూపీనే
పదరే నా మతికి దాఁ బై కొసరా

(॥ఇది॥)
నిక్కి నే విరహమున నిట్టూర్పు నించఁగాను
పుక్కటఁ దా నేమిసేశో బుసకొట్టీనే
చెక్కుచేతిచింతతో నే చెమరించఁగాఁ దాను
చిక్కినసురతముల చెమటఁ దోఁగీనే

(॥ఇది॥)
తనపై మోహమున నే దగఁ బులకించఁగాను
పొనిగి తానేమిటివో పులకించీనే
నినుపుఁగోరికల నే నివ్వెరగుపడఁగాను
వెనకటి చేఁతలకు వెరగందీనే

(॥ఇది॥)
కమ్మరఁగమ్మర నే కాఁగిలించఁగా తాను
కమ్మి యెవ్వతోఁ దలఁచి కాఁగిలించీనే
అమ్మరో శ్రీవేంకటేశుఁ డట్టివాఁడా కాఁడు నేఁడు
నమ్మించి నన్నుఁ గూడి నవ్వు నవ్వీనే

(||pallavi||)
idi dā nā valabaṁṭā yīḍusūbīne
padare nā madigi dām̐ bai kŏsarā

(||idi||)
nikki ne virahamuna niṭṭūrbu niṁcham̐gānu
pukkaḍam̐ dā nemiseśho busagŏṭṭīne
sĕkkusedisiṁtado ne sĕmariṁcham̐gām̐ dānu
sikkinasuradamula sĕmaḍam̐ dom̐gīne

(||idi||)
tanabai mohamuna ne dagam̐ bulagiṁcham̐gānu
pŏnigi tānemiḍivo pulagiṁchīne
ninubum̐gorigala ne nivvĕragubaḍam̐gānu
vĕnagaḍi sem̐talagu vĕragaṁdīne

(||idi||)
kammaram̐gammara ne kām̐giliṁcham̐gā tānu
kammi yĕvvadom̐ dalam̐si kām̐giliṁchīne
ammaro śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭivām̐ḍā kām̐ḍu nem̐ḍu
nammiṁchi nannum̐ gūḍi navvu navvīne