Idevo naa gunamu yimtagamte nemi sedu

ఇదెవో నా గుణము యింతకంటె నేమి సేతు
Language

(॥పల్లవి॥)
ఇదెవో నా గుణము యింతకంటె నేమి సేతు
పదిలానఁ దాను నేరుపఁగ వచ్చె నాకునూ

(॥॥)
చలము సాదించ నేర సరసుని తోడుత
చెలరేఁగి ప్రియములు చెప్ప నేర్తును
బలిమిఁ బెనఁగఁ జాలఁ బై కొంటేఁ జేతికి
చులుకఁగా మెలఁగి మెచ్చులు మెచ్చఁజాలుదు

(॥॥)
బొమ్మల జంకించ నోప పూచి తన్ను నింతలోనె
సమ్మతించి వలపులు చల్ల నోపుదు
దొమ్మిసేయ నెఱుఁగను తొడరి తాఁ గూడితేను
వుమ్మగిలుఁ దమి నూరకుండ నెఱుఁగుదును

(॥॥)
బీరమాడ నియ్యకొనఁ బ్రేమ శ్రీ వేంకటేశుఁడు
కోరి నన్నుఁ గూడె నియ్యకొనెఁ గాని
నేరము లెంచఁదా నిగిడి నన్ను మన్నించె
నేరుపులే సారె సారెనె నెంచెఁ గాని

(||pallavi||)
idĕvo nā guṇamu yiṁtagaṁṭĕ nemi sedu
padilānam̐ dānu nerubam̐ga vachchĕ nāgunū

(||||)
salamu sādiṁcha nera sarasuni toḍuda
sĕlarem̐gi priyamulu sĕppa nerdunu
balimim̐ bĕnam̐gam̐ jālam̐ bai kŏṁṭem̐ jedigi
sulugam̐gā mĕlam̐gi mĕchchulu mĕchcham̐jāludu

(||||)
bŏmmala jaṁkiṁcha noba pūsi tannu niṁtalonĕ
sammadiṁchi valabulu salla nobudu
dŏmmiseya nĕṟum̐ganu tŏḍari tām̐ gūḍidenu
vummagilum̐ dami nūraguṁḍa nĕṟum̐gudunu

(||||)
bīramāḍa niyyagŏnam̐ brema śhrī veṁkaḍeśhum̐ḍu
kori nannum̐ gūḍĕ niyyagŏnĕm̐ gāni
neramu lĕṁcham̐dā nigiḍi nannu manniṁchĕ
nerubule sārĕ sārĕnĕ nĕṁchĕm̐ gāni